ఆమె వయసు 17 ఏళ్లు.. బరువు 2.1 కేజీలు.. ప్రపంచంలోనే వింత సంఘటన..

ABN , First Publish Date - 2021-06-15T21:58:21+05:30 IST

లూసియా జరాటే.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువు కలిగిన వ్యక్తి.

ఆమె వయసు 17 ఏళ్లు.. బరువు 2.1 కేజీలు.. ప్రపంచంలోనే వింత సంఘటన..

లూసియా జరాటే.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువు కలిగిన వ్యక్తి. 17 ఏళ్ల వయసులో ఆమె బరువు కేవలం 2.1 కేజీలు మాత్రమే. `ఎమ్‌ఓపీడీ-II` వ్యాధి కారణంగా ఆమె బరువు పెరగలేదు. ఈ ప్రపంచంలో ఈ వ్యాధికి గురైన తొలి వ్యక్తి లూసియానే. మెక్సికోలో 1863లో పుట్టిన లూసియాలో ఒక సంవత్సరం మాత్రమే ఎదుగుదల కనిపించింది. ఆ తర్వాత 17 ఏళ్ల వరకు అదే పొడవు, అదే బరువుతో ఉండిపోయింది. 


12 ఏళ్ల వయసులో ఆమె మెక్సికో నుంచి అమెరికాకు వెళ్లి తన బలహీనతనే బలంగా మార్చుకుని ప్రదర్శనలు ఇచ్చేది. అలా ప్రదర్శనలు ఇస్తూనే 1890లో ఆమె హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోవడం) కారణంగా చనిపోయింది. కాగా, అతి తక్కువ బరువు గల పెద్ద వ్యక్తిగా లూసియా గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. 



Updated Date - 2021-06-15T21:58:21+05:30 IST