కళ్లకు గంతలతో క్యాండిల్స్‌ వెలిగించి..!

ABN , First Publish Date - 2021-07-02T05:30:00+05:30 IST

క్యాండిల్‌ వెలిగించాలంటే గాలి రాకుండా ఒక చేయి అడ్డుపెట్టి జాగ్రత్తగా వెలిగిస్తారు. మరి కళ్లకు గంతలు కట్టుకుని వెలిగించమంటే మావల్ల కాదని అంటారు కదూ! కానీ ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు చెందిన...

కళ్లకు గంతలతో క్యాండిల్స్‌ వెలిగించి..!

క్యాండిల్‌ వెలిగించాలంటే గాలి రాకుండా ఒక చేయి అడ్డుపెట్టి జాగ్రత్తగా వెలిగిస్తారు. మరి కళ్లకు గంతలు కట్టుకుని వెలిగించమంటే మావల్ల కాదని అంటారు కదూ! కానీ ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు చెందిన పదకొండేళ్ల డీరన్‌ సి. రెడ్డి మాత్రం తడుముకోకుండా వెలిగిస్తాడు. చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే తపన ఇతనికి ఎక్కువ. ఆ తపనే ఈ విన్యాసం చేసేందుకు పురిగొల్పింది. కళ్లకు గంతలు కట్టుకుని ఒకటి రెండు కాదు, ఏకంగా 22 క్యాండిల్స్‌ వెలిగించాడు. అది కూడా ఒక నిమిషం సమయంలోనే! అందుకే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించాడు.

Updated Date - 2021-07-02T05:30:00+05:30 IST