ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ డౌన్‌లోడింగ్‌ ఇలా...

ABN , First Publish Date - 2021-05-22T09:02:54+05:30 IST

ఫొటోలు, వీడియోల షేరింగ్‌లో పాపులర్‌ అయిన ‘ఇన్‌స్టాగ్రామ్‌’ ఆఫ్‌లైన్‌లో వీక్షించేందుకు వీలుగా కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోనివ్వదు. అయితే కొంతమంది ఔత్సాహికులు దీనిని సాధ్యం చేసి చూపించారు.

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ డౌన్‌లోడింగ్‌ ఇలా...

ఫొటోలు, వీడియోల షేరింగ్‌లో పాపులర్‌ అయిన  ‘ఇన్‌స్టాగ్రామ్‌’ ఆఫ్‌లైన్‌లో వీక్షించేందుకు వీలుగా కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోనివ్వదు. అయితే కొంతమంది ఔత్సాహికులు దీనిని సాధ్యం చేసి చూపించారు.  

మొదట సేవ్‌ చేయాలని అనుకుంటున్న రీల్స్‌ వీడియోను ఎంచుకోండి.

త్రీ డాట్‌ ఐకాన్‌ను టాప్‌ చేసి, సేవ్‌ బటన్‌ను హిట్‌ చేయాలి. 

సెట్టింగ్స్‌ - అకౌంట్‌ - సేవ్డ్‌ చేయాలి. 

రీల్స్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అనేకానేక ఆన్‌లైన్‌ టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. రీల్స్‌ వీడియో యుఆర్‌ఎల్‌ తెలుసుకుని బైటకు లాగి సదరు టూల్‌లో పేస్ట్‌ చేయాలి. మిగతా పనిని ఆ టూల్‌ చేసిపెడుతుంది. 

దీని కోసం ఇన్‌స్టాఫిస్టా, ఇన్‌గ్రామర్‌ వంటి ఏ టూల్‌నైనా ఉపయోగించవచ్చు. 

అలాగే యుఆర్‌ఎల్‌ కోసం త్రీ డాట్‌ ఐకాన్‌పై టాప్‌ చేసి, లింక్‌ ఆప్షన్‌ను కాపీ చేయాలి. గూగుల్‌ ప్లే లోని మూడో పార్టీ యాప్స్‌తోనూ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2021-05-22T09:02:54+05:30 IST