కిచెన్‌ గార్డెనింగ్‌ ఇలా...

ABN , First Publish Date - 2021-07-28T05:40:41+05:30 IST

మొక్కలు పెంచడానికి డబ్బులు పెట్టి మార్కెట్లో దొరికే కుండీలు కొనాల్సిన అవసరం లేదు.

కిచెన్‌ గార్డెనింగ్‌ ఇలా...

సూర్యరశ్మి పడే ప్రాంతంలో కుండీలు పెట్టుకోవాలి. కిచెన్‌ గార్డెన్‌ ప్లాంట్స్‌కు కనీసం 3 నుంచి 6 గంటల సూర్యరశ్మి అవసరం అవుతుంది. 

మొక్కలు పెంచడానికి డబ్బులు పెట్టి మార్కెట్లో దొరికే కుండీలు కొనాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌, జార్స్‌, గ్లాస్‌ కంటెయినర్స్‌లో కూడా కొత్తిమీర, పాలకూర, ఉల్లి, పుదీనా వంటి వాటిని పెంచుకోవచ్చు.

మొక్కను ఎందులో పెంచుతున్నారనేది ప్రధానం కాదు. అందులో పోసిన మట్టి ఎంత సారవంతమైనది అనేది చాలా ముఖ్యం. సారవంతమైన మట్టి లేకుండా ఎంత పెద్ద కుండీలో మొక్క పెట్టినా ప్రయోజనం ఉండదు


కిచెన్‌ గార్డెనింగ్‌కు అవసరమైన విత్తనాలను నర్సరీలో లేదా గార్డెనింగ్‌ వస్తువులు అమ్మే షాపుల్లో కొనుగోలు చేయాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, లెమన్‌గ్రాస్‌, పాలకూర వంటి వాటిని పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. టొమాటో, మిర్చి, అల్లం, బంగాళదుంప వంటి వాటిని కూడా పెంచవచ్చు. 

నీళ్లు అవసరం మేరకే పోయాలి. కుండీల కింది నుంచి నీళ్లు బయటకు పోయేలా రంధ్రాలు తప్పనిసరిగా ఉండాలి.  

ఎలాంటి రసాయన పదార్థాలు ఉపయోగించకుండా పెంచిన ఆకుకూరలు, కాయగూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్చు కూడా కలిసి వస్తుంది.  

Updated Date - 2021-07-28T05:40:41+05:30 IST