Abn logo
Sep 11 2021 @ 09:31AM

Delhi: ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామంటూ బెదిరింపు..అలర్ట్

న్యూఢిల్లీ : అమెరికాలోని 9/11 దాడి తరహాలో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఢిల్లీ విమానాశ్రయాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు.లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో  న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రతా అధికారులు శుక్రవారం అర్థరాత్రి  అప్రమత్తమయ్యారు.

బాంబు బెదిరింపు కాల్  రాత్రి ఢిల్లీలోని రహోలా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నామని ఢిల్లీ డీసీపీ ప్రతాప్ సింగ్ ట్వీట్ చేశారు.విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కాల్సిన వారు ఆలస్యం చేయకుండా ముందుగా రావాలని డీసీపీ ప్రయాణికులకు సూచించారు. బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో అన్ని ప్రాంతాలను భద్రతాధికారులు తనిఖీలు చేస్తున్నారు.