లిల్లీ పువ్వు

ABN , First Publish Date - 2020-08-24T05:30:00+05:30 IST

ఒక తెల్ల కాగితంపై లిల్లీపువ్వు రేకులను గీయాలి.

లిల్లీ పువ్వు

కావలసినవి:  రంగు , కాగితాలు,  పెన్సిల్‌, జిగురు,  కత్తెర,  స్ట్రా ,  టేప్‌ .


తయారీ

  1.  ఒక తెల్ల కాగితంపై లిల్లీపువ్వు రేకులను గీయాలి. తరువాత జాగ్రత్తగా కత్తిరించాలి. పువ్వు రేకులు ఎలా గీసారో అలాగే కత్తిరించుకోవాలి.
  2.  ఇప్పుడు మొదటి రేకును చివరి రేకును జిగురుతో అతికించాలి. పై భాగంలో రేకులను కొద్దిగా కిందకు వంచాలి.
  3.  తరువాత దాన్ని ఒక స్ట్రా చివర టేప్‌తో అతికించాలి. పసుపు రంగు కాగితాన్ని స్ట్రాపై అతికించాలి.
  4.  ఇప్పుడు ఆకుపచ్చరంగు కాగితం తీసుకుని కొన్ని ఆకులు తయారు చేసుకోవాలి. వాటిని స్ట్రాకి రెండు వైపులా అతికించాలి. అంతే.. లిల్లీపువ్వు రెడీ!

Updated Date - 2020-08-24T05:30:00+05:30 IST