రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి లైన్‌క్లియర్‌

ABN , First Publish Date - 2022-01-22T06:21:16+05:30 IST

ఎన్నో ఏళ్లు గా పరిష్కారానికి నోచుకోని తాంసి బస్టాండ్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ చేస్తూ శుక్రవారం పరిపాల

రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి లైన్‌క్లియర్‌

రూ.97.20 కోట్ల మంజూరు

ఆదిలాబాద్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లు గా పరిష్కారానికి నోచుకోని తాంసి బస్టాండ్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ చేస్తూ శుక్రవారం పరిపాలన అనుమ తులను ఇచ్చింది. రాష్ట్రంలో చాటన్‌పల్లి షాద్‌నగర్‌, పెద్దపల్లిటౌన్‌, నిజామాబాద్‌ జిల్లా మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలతో పాటు ఆదిలాబాద్‌ జిల్లా తాంసి బస్టాండ్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. ఆదిలాబాద్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.57.71 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.39.49కోట్లు మొత్తం రూ.97.20కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తాంసి బస్టాండ్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు చైర్మన్‌ రాజీనామా చేయాలంటూ ఈ నెల 5న ఎమ్మెల్యే ఇళ్లును ముట్టడించి తాంసి బస్టాండ్‌ వద్ద ధర్నాలు, ఆందోళనకు దిగారు. దీంతో సీరియస్‌గా తీసుకున్న ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేసే లా చొరవ తీసుకున్నారు. మొత్తానికి మున్సిపల్‌ చైర్మ న్‌ పంతం నెగ్గించుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎట్టకేలకు ప్రజల ఇబ్బందుల ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-22T06:21:16+05:30 IST