Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా లింగయ్య

సూర్యాపేట అర్బన్‌, నవంబరు 29: సూర్యాపేటలోని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌)కార్యాయంలో కౌ న్సిల్‌ సమావేశాన్ని  సోమవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా రేపాక లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా వేణు, ఆనంద్‌భాస్కర్‌, రమణ, కార్యదర్శులుగా పాష, వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌, క్రాంతికుమార్‌, రాష్ట్ర కౌన్సిలర్లుగా వెంకటేశ్వర్లు, కవిత, దశరథరామారావు, వెంకటేశ్వర్లు, యోగానంద్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా మేరీలా, సభ్యులుగా రాజశేఖర్‌, రామకృష్ణలు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement