ఆంగ్లమాఽధ్యమంపై ‘సుప్రీం’కు భాషావేత్తలు

ABN , First Publish Date - 2020-09-25T08:45:45+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ పలువురు భాషావేత్తలు, కవులు, రచయితలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ

ఆంగ్లమాఽధ్యమంపై  ‘సుప్రీం’కు భాషావేత్తలు

బుద్ధప్రసాద్‌, జొన్నవిత్తుల ఇంప్లీడ్‌ పిటిషన్‌ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ పలువురు భాషావేత్తలు, కవులు, రచయితలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, కవి, సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు, కవులు వద్దిపర్తి పద్మాకర్‌, డి.విజయభాస్కర్‌, తెలుగు పండితుడు పాలపర్తి శ్యామలానంద ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


తెలుగుకు ప్రాచీన హోదా కల్పించి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో కేంద్రం చేర్చిందని వారు పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల బోధన విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకమని, హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వవద్దని అభ్యర్థించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ 29న విచారణకు వచ్చే అవకాశం ఉంది. దానితో పాటే ఈ ఇంప్లీడ్‌ పిటిషన్‌పై కూడా విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-25T08:45:45+05:30 IST