మాట్లాడే గుహ!

ABN , First Publish Date - 2020-07-30T05:30:00+05:30 IST

ఆకలితో ఉన్న సింహం ఒకరోజు ఆహారం కోసం అడవంతా తిరిగింది. సాయంత్రం అవుతున్నా ఒక్క జంతువు కంటపడలేదు....

మాట్లాడే గుహ!

ఆకలితో ఉన్న సింహం ఒకరోజు ఆహారం కోసం అడవంతా తిరిగింది. సాయంత్రం అవుతున్నా ఒక్క జంతువు కంటపడలేదు. తిరిగి తన గూటికి వెళ్లిపోదామని అనుకుంటున్న సమయంలో ఒక గుహ కనిపించింది. ‘‘కచ్చితంగా ఇందులో ఏదో ఒక జంతువు నివాసం ఉంటుంది. రాత్రి వరకు ఇక్కడే ఉంటే దాన్ని తినొచ్చు’’ అనుకుంది. అది నక్క నివాసం ఉండే గుహ. చీకటి పడ్డాక వచ్చిన నక్క గుహ బయట సింహం అడుగులను గమనించింది. లోపలికి వెళ్లడానికి ధైర్యం చాలక ఒక ఉపాయం ఆలోచించింది. ‘‘నేను లోపలకు రావచ్చా! నువ్వు అనుమతిస్తేనే లోపలకు వస్తాను. లేకపోతే రాను’’ అంటూ గుహను అడగడం మొదలెట్టింది. గుహ అనుమతిస్తేనే నక్క లోపలకు వస్తుందని భావించిన సింహం ‘‘నువ్వు లోపలకు రావచ్చు’’ అంది. లోపల సింహం ఉన్నదని నిర్ధారణ కావడంతో వెంటనే నక్క అక్కడి నుంచి పరుగు అందుకుంది. 

Updated Date - 2020-07-30T05:30:00+05:30 IST