Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెస్సీ ఏడోసారి..

అర్జెంటీనా స్టార్‌దే బాలన్‌ డీ ఓర్‌ అవార్డు

పారిస్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బాలన్‌ డీ ఓర్‌ అవార్డును రికార్డుస్థాయిలో ఏడోసారి గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. పారి్‌సలో జరిగిన వేడుకలో 34 ఏళ్ల మెస్సీ ఈ ఏడాదికిగాను అవార్డు అందుకున్నాడు. మెస్సీ ఈ ఏడాది కోపా అమెరికా టోర్నీతో తొలిసారి మేజర్‌ టైటిల్‌ను అర్జెంటీనాకు అందిం చాడు. అవార్డు ఎంపికలో 30 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్‌ చేయగా, 613 ఓటింగ్‌ పాయింట్లతో మెస్సీ విజేతగా నిలిచాడు.  లెవాన్‌డోస్కీ (పోలెండ్‌-580 పా యింట్లు) రెండోస్థానంలో నిలిచాడు. పోర్చుగల్‌ హీరో క్రిస్టియానో రొనాల్డో   ఆరోస్థానంలో నిలిచాడు. మెస్సీ గతంలో 2009, 2010, 2011, 2012, 2015, 2019లో ఈ అవార్డును దక్కించుకున్నాడు. కరోనా కారణంగా గతేడాది అవార్డుల కార్యక్రమాన్ని రద్దు చేశారు. మహిళల విభాగంలో స్పెయిన్‌కు చెందిన 27 ఏళ్ల అలెక్సియా పుటెల్లాస్‌ బాలన్‌ డీ ఓర్‌ అవార్డు గెల్చుకుంది.

Advertisement
Advertisement