శాఫ్‌ చాంప్‌ భారత్‌

ABN , First Publish Date - 2021-10-17T08:23:54+05:30 IST

కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి దిగ్గజ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ రికార్డు సమం చేసిన వేళ.. భారత జట్టు సౌత్‌ ఏషియన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (శాఫ్‌) చాంపియన్‌గా ఆవిర్భవించింది.

శాఫ్‌ చాంప్‌ భారత్‌

ఫైనల్లో నేపాల్‌పై గెలుపు 

మెస్సీ రికార్డు సమం చేసిన ఛెత్రి

మాలె: కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి దిగ్గజ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ రికార్డు సమం చేసిన వేళ.. భారత జట్టు సౌత్‌ ఏషియన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (శాఫ్‌) చాంపియన్‌గా ఆవిర్భవించింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 3-0తో నేపాల్‌ను చిత్తు చేసి టైటిల్‌ అందుకుంది. టీమిండియా ఎనిమిదోసారి శాఫ్‌ విజేతగా నిలవడం విశేషం. భారత్‌ తరపున ఛెత్రి (49వ నిమిషం), సురేశ్‌ (50), సాహల్‌ (90) గోల్స్‌ సాధించారు. 80వ గోల్‌ చేసిన ఛెత్రి..అర్జెంటీనా సూపర్‌ స్టార్‌ మెస్సీ సరసన నిలిచాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆడుతూ అంతర్జాతీయ సాకర్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డు పుటలకెక్కాడు. 

Updated Date - 2021-10-17T08:23:54+05:30 IST