Abn logo
May 25 2020 @ 04:04AM

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

కారు, లారీల్లో ఆంధ్రాకు రవాణా

 

అశ్వారావుపేట, మే 24: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆదివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. అశ్వారావుపేట ప్రాంతంలో కొనుగోలు చేసిన 54 రాయల్‌స్ర్టాగ్‌, రెండు మ్యాన్సన్‌హౌస్‌ సీసాలను కారులో తరలించి అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాల సమీపంలో ఓ లారీలో సరిహద్దు దాటించేందుకు సర్దుతుండగా  సమాచారం అందుకున్న అశ్వారావుపేట ఎస్‌ఐ రామ్మూర్తి దాడి చేసి 56మంద్యం సీసాలను పట్టుకున్నారు. అయితే అంతకు ముందే మూడు లారీల్లో మరికొన్ని మద్యం సీసాలను తరలించినటు తెలుస్తోంది. పట్టుకున్న మద్యం విలువ రూ.60వేల వరకు ఉంటుందని సమాచారం. మద్యాన్ని సరిహద్దు దాటిస్తున్న కారులో ఓ వార్తా ఛానల్‌కు సంబంధించిన లోగో ఉంచుకుని కొందరు మద్యాన్ని తరలిస్త్నుట్లుగా తెలుస్తోంది. మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులను, కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పంచనామా నిర్వహించిన పోలీసులు మద్యాన్ని ఆబ్కారీ అధికారులకు అప్పగించారు.  

Advertisement
Advertisement