Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యం షాపుల టెండర్లు పూర్తి

- మిగిలిన రెండు షాపులకు డ్రా తీసిన కలెక్టర్‌

పెద్దపల్లి, నవంబర్‌ 30 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో గల రిటెయిల్‌ మద్యం షాపులకు మంగళవారం నాటితో టెండర్ల ప్రక్రియ పూర్త య్యింది. జిల్లా వ్యాప్తంగా 77 షాపు లను ఏర్పాటు చేయగా, 75 షాపుల కు ఈ నెల 19వ తేదీన డ్రా ద్వారా ఎంపిక చేశారు. గోదావరిఖని ప్రాం తంలోని మార్కెట్‌ ఏరియాలో గల గెజిట్‌ నంబర్‌ 49 షాపును ఎస్సీ వర్గాలకు కేటాయించారు. అలాగే ఫైవ్‌ ఇంక్లయిన్‌ కాలనీ తిలక్‌నగర్‌ లో గల షాపును గౌడ కులస్తులకు కేటాయించారు. ఈ రెండు షాపుల కు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో మరోసారి దరఖాస్తులకు నోటిఫికేషన్‌ జారీచేశారు. ఒక్కో దానికి 19 చొ ప్పున దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ డ్రా తీసి ఎంపిక చేశారు. అనంతరం ఎంపికైన వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా ఎక్పైజ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, సీఐలు వినోద్‌ రాథోడ్‌, రమే ష్‌, ఎస్‌ఐలు విజయ భాస్కర్‌, రఽఘు, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement