అదే తీరు.. అదే బారు..!

ABN , First Publish Date - 2020-08-04T11:12:29+05:30 IST

కరోనా విజృంభణ నేపధ్యంలో వారం రోజులుగా కడప నగరంలో మద్యం దుకాణాలు మూతబడ్డాయి

అదే తీరు.. అదే బారు..!

కడప సిటీ, ఆగస్టు 3 : కరోనా విజృంభణ నేపధ్యంలో వారం రోజులుగా కడప నగరంలో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. అయితే ఆదివారం నుంచి తిరిగి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అమ్మకాల సమయంలో మార్పు చోటు చేసుకుంది. ముందు రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ విక్రయించేవారు. ప్రస్తుతం ఉదయం 8.30 నుంచి 10.30 వరకు విక్రయిస్తున్నారు.


సమాచారం తెలిసిన వెంటనే మద్యంప్రియులు మద్యం దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. 8 గంటలకే దుకాణాల వద్దకు చేరుకుని క్యూ కడుతున్నారు. కోరిన బ్రాండ్‌ లేకపోయినా, ధర ఎక్కువయినా మద్యం ప్రియులు ఎగబడుతున్నారు. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మాత్రం మద్యంప్రియులు ఖాతరు చేయడం లేదు. ఒకరినొకరు తోసుకుంటూ మద్యంకోసం ఎగబడుతున్నారు. ఆదాయమే పరమావధిగా మద్యం దుకాణాలు తెరవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-04T11:12:29+05:30 IST