first case: అమెరికాలో జింకకు కరోనా వైరస్

ABN , First Publish Date - 2021-08-28T12:54:36+05:30 IST

గతంలో కుక్కలు, పిల్లులు, సింహాలు, మంచు చిరుతపులులు, గొరిల్లాలకు సోకిన కరోనా వైరస్ తాజాగా జింకకు కూడా వచ్చింది...

first case: అమెరికాలో జింకకు కరోనా వైరస్

వాషింగ్టన్ (అమెరికా): గతంలో కుక్కలు, పిల్లులు, సింహాలు, మంచు చిరుత పులులు, గొరిల్లాలకు సోకిన కరోనా వైరస్ తాజాగా జింకకు కూడా వచ్చింది.ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని అమెరికా వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించింది. జింకకు కరోనా వైరస్ ఎలా సోకిందనేది ఇంకా తేలలేదని అమెరికా ప్రతినిధి లిండ్సే కోల్ చెప్పారు. మనుషుల ద్వారా, లేదా జంతు జాతుల ద్వారా జింకకు కరోనా సోకిందేమోనని తాము అనుమానిస్తున్నామని వైద్యనిపుణులు చెప్పారు. 


గతంలో కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన జంతువులకు కరోనా సోకిందని వైద్యనిపుణులు చెపుతున్నారు.ఒహియో స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ వైద్యనిపుణులు ఒహియోలోని జింకల నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా,  ఓ జింకకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబోరేటరీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 


Updated Date - 2021-08-28T12:54:36+05:30 IST