గూగుల్‌ ప్లేస్టోర్‌లో ట్రెండింగ్‌ యాప్స్‌ లిస్ట్‌

ABN , First Publish Date - 2021-01-23T05:49:31+05:30 IST

ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌ ట్రెండ్స్‌ను చూపించే ప్రక్రియకు సెర్చ్‌ జెయింట్‌ ‘గూగుల్‌’ శ్రీకారం చుట్టింది. సదరు యాప్స్‌ ముందు కొత్తగా ఒక

గూగుల్‌ ప్లేస్టోర్‌లో ట్రెండింగ్‌ యాప్స్‌ లిస్ట్‌

ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌ ట్రెండ్స్‌ను చూపించే ప్రక్రియకు సెర్చ్‌  జెయింట్‌ ‘గూగుల్‌’ శ్రీకారం చుట్టింది. సదరు యాప్స్‌ ముందు కొత్తగా ఒక ఐకాన్‌పెట్టి అది పైకి, కిందకు కదులుతున్నట్టు చూపడం ద్వారా ట్రెండ్స్‌ను తెలియజేస్తోంది. 


దీని ద్వారా ప్లేస్టోర్‌లో ఏయే యాప్స్‌ 

ట్రెండింగ్‌లో ఉన్నాయని వ్యూవర్స్‌ తెలుసుకోవచ్చు. అయితే ఓవరాల్‌గా స్టోర్‌లో ఉన్న స్లాట్స్‌లో ఎన్ని పైకి, మరెన్ని కిందకు వెళ్ళాయి, ట్రెండింగ్‌ ఎప్పటి నుంచి మొదలైంది అన్నది కూడా తెలిసేలా ఇది లేదు. 


 గేమింగ్‌, నాన్‌గేమింగ్‌ యాప్స్‌కు సంబంధించి 2020 అనేది ఒక రికార్డు సంవత్సరం అని ‘సెన్సర్‌ టవర్‌’ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఈ యాప్స్‌ కోసం 38.6 బిలియన్‌ డాలర్లు వ్యయం చేశారు.


అంతకుమునుపు 2019లో  ఇది 29.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా ముప్పయ్‌ శాతం మేర వృద్ధి చెందిందని కూడా నివేదిక తెలిపింది.

Updated Date - 2021-01-23T05:49:31+05:30 IST