అంబేడ్కర్‌! మీరైనా ఆలకించండి..!

ABN , First Publish Date - 2022-01-27T06:59:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివర్స్‌ పీఆర్సీపై తమ విన్నపాలు ఆలకించాలంటూ ఉద్యోగులు, ఉ పాధ్యాయులు.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాలకు విన్నవించారు.

అంబేడ్కర్‌! మీరైనా ఆలకించండి..!
అనంతలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న పీఆర్సీ సాధన సమితి నేతలు

ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేడుకోలు

అనంతపురం విద్య/ప్రె్‌సక్లబ్‌, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివర్స్‌ పీఆర్సీపై తమ విన్నపాలు ఆలకించాలంటూ ఉద్యోగులు, ఉ పాధ్యాయులు.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాలకు విన్నవించారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ-అమరావతి, ఏపీ జీఈఏ, ఏపీ జీఈఎఫ్‌, ఉపాధ్యాయ జేఏసీల నేతలు బుధవారం జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపారు. అంబేడ్కర్‌ విగ్రహాలున్న సర్కిళ్లకు ర్యాలీగా వచ్చారు. తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పలు జేఏసీల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందించారు. కొన్నిచో ట్ల ప్రభుత్వ కార్యాలయాల్లోనే అంబేడ్కర్‌ చిత్రపటాలకు వినతులు అందించారు. ‘పీఆర్సీ వద్దే వద్దు... పాత పీఆర్సీ జీతాలే ముద్దు అంటూ’ నినాదాలు చేస్తూ.. సర్కారు తీరుపై మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని జడ్పీ సమీపానగల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పలు సంఘాల నాయకులు నిరసనలు తెలిపారు. డీ హీరేహాళ్‌, మడకశిర, హిందూపురం, గోరంట్ల, పుట్టపర్తి, వజ్రకరూరు, ఉరవకొండ, ఓబుళదేవరచెరువు, గుత్తి, బెళుగుప్ప, శింగనమల, ధర్మవరం, పెనుకొండ, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, క దిరి తదితర ప్రాంతాల్లో కూడళ్లలోని అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రా లు అందించారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై పెదవి విరిచారు. అనంతపురంలో ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అతావుల్లా మాట్లాడుతూ... పాత జీతాలిచ్చి.. జీవోలను రద్దుచేస్తేనే చర్చలకు వస్తామన్నారు. అర్థంలేని జీవోలు... పీఆర్సీ రూపొందించి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మికుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను బట్టబయలు చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ ఏ ఒక్క ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్‌, కార్మికుడు పట్టుసడలరన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఉ ద్యోగులు, ఉపాధ్యాయులపై పోలీసులను అడ్డుపెట్టుకుని, ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా... ప్రస్తుతమున్న జీతాలతోపాటు పెండింగ్‌లో ఉన్న డీఏలు చెల్లించకపోయినా తమ సత్తా చూపుతామన్నారు. మొదటి, రెండోదశ నిరసనలు, ఉద్యమాలు ముగిశాయన్నారు. రాబోవు రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ-అమరావతి జిల్లా చైర్మన దివాకర్‌రావు, ఏపీ జీఈఏ చైౖర్మన గోపీకృష్ణ, ఏపీ జీఈఎఫ్‌ అధ్యక్షుడు రాధాకృష్ణరెడ్డి, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, ఏపీ జేఏసీ నగరాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఆంధ్రప్రదశ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, ఎంఈఎఫ్‌ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్‌, ఆప్టా వెంకటరత్నం, ఏపీఎన్జీఓ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు మాధవ, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సూరీడు, ఏపీటీఎఫ్‌ 1938 నాయకులు రవీంద్ర, విశ్వనాథ్‌రెడ్డి, వెంకటరెడ్డి, డీటీఎఫ్‌ బాబు, పీఆర్‌టీయూ చంద్రశేఖర్‌ రెడ్డి, విష్ణువర్దన రెడ్డి, ఎస్‌ఎల్‌టీఏ శివానందరెడ్డి, ఏపీఎన్జీఓ నాయకులు శ్రీధర్‌బాబు, జమీలాబేగం, వేణుగోపాల్‌, శ్రీధర్‌స్వామి, చంద్రమోహన, సాంబశివమ్మ, నాగభూషణరెడ్డి, ఫరూక్‌, ఆర్‌ఈఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర, గౌరవాధ్యక్షుడు రామకృష్ణ, రాయలసీమ అధ్యక్షుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


నేటి నుంచి రిలే దీక్షలు...

రివర్స్‌ పీఆర్సీని రద్దు చేయాలంటూ... పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని జేఏసీల నేతలు నిర్వహిస్తున్న మొదటి దశ, రెండో దశ నిరసన ర్యాలీలు, ధర్నా, అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించడం ముగిశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యమ కార్యాచరణలో భాగమైన మూడో దశ రిలే దీక్షలకు ఆయా నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాలు రిలే దీక్షలకు పూనుకున్నారు. అందులో భాగంగానే గురువారం జిల్లా కేంద్రంలోని కేఎ్‌సఆర్‌ బాలికల కళాశాల వద్ద రిలే దీక్షలు చేపడుతున్నట్లు ఆ సాధన సమితి నేతలు తెలిపారు.

Updated Date - 2022-01-27T06:59:32+05:30 IST