ఈ వారం సాహిత్య కార్యక్రమాలు

ABN , First Publish Date - 2021-04-12T05:48:21+05:30 IST

వి. చంద్రశేఖరరావు కథా పురస్కారం రాయలసీమ దళిత కథలకు ఆహ్వానం అడవి బాపిరాజుపై రచనలకు ఆహ్వానం కథలు, కవితల పోటీ...

ఈ వారం సాహిత్య కార్యక్రమాలు

వి. చంద్రశేఖరరావు కథా పురస్కారం

2020 సంవత్సరానికి వి.చంద్రశేఖరరావు కథా పురస్కారాన్ని సుంకోజి దేవేంద్రాచారి, ఇండ్ల చంద్రశేఖర్‌ స్వీకరిస్తారు. ఈ పురస్కారాల్ని ఏప్రిల్‌ 18 సాయంత్రం కొరటాల భవన్‌, 2/7, బ్రాడీపేట, గుంటూరులో చంద్రశేఖరరావు సతీ మణి కిన్నెర ప్రసూన ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా వి. చంద్రశేఖరరావు సాహిత్యంపై వివిధ రచయితల వ్యాస సంకలనం ‘అదృశ్య మైన నిప్పుపిట్ట కోసం...’ పుస్తకాన్ని కె. శివారెడ్డి ఆవిష్కరిస్తారు. కాట్రగడ్డ దయానంద్‌, పాపి నేని శివశంకర్‌, పెనుగొండ లక్ష్మీ నారాయణ, వాసిరెడ్డి నవీన్‌, కె. శివప్రసాద్‌ పాల్గొంటారు. 

వి.చంద్రశేఖరరావు సాహితీ కుటుంబం


రాయలసీమ దళిత కథలకు ఆహ్వానం

మనస్విని ప్రచురణల ఆధ్వర్యంలో రాయల సీమ దళిత కథల సంకలనం రానున్నది. రాయల సీమ దళిత రచయితలు దేశంలో ఎక్కడ స్థిరపడినా పంపవచ్చు. ఏ4 సైజు డిటిపిలో 4 పేజీలకు మించని కథను పేజ్‌ మేకర్‌-7లో పంపాలి. మే 15లోగా ఈమెయిల్‌: manaswiniprachuranalu@gmail.comకు పంపాలి. వివరాలకు: 9493375447.

కెంగార మోహన్‌


అడవి బాపిరాజుపై రచనలకు ఆహ్వానం

అడవి బాపిరాజు జయంతి అక్టోబర్‌ 8 సందర్భంగా వ్యాస సంకలనం తీసుకువస్తున్నాం. ఆయన కళా ప్రజ్ఞా పాటవాలకు దివిటీ పట్టేలా ఏ4 సైజులో 3-4 పేజీలకు వ్యాసాన్ని టైప్‌ చేసి జూన్‌ 15 లోగా పంపాలి. అలాగే ఆయనపై వచ్చిన ఇతర విలువైన వ్యాసాల వివరాలూ అందించవచ్చు. వివరాలకు: 94407 32392. 

మండలి బుద్ధప్రసాద్‌


కథలు, కవితల పోటీ

వురిమళ్ళ ఫౌండేషన్‌-అక్షరాల తోవ సంయు క్తంగా నిర్వహిస్తున్న పోటీకి కవితలు, కథలను ఆహ్వానిస్తున్నాం. ఏప్రిల్‌ 30లోగా చిరునామా: భోగోజు ఉపేందర్‌ రావు, ఇం.నెం. 11-10- 694/5, బురహాన్‌పురం, ఖమ్మం 507001. మరిన్ని వివరాలకు ఫోన్‌: 9494773969.  

వురిమళ్ల సునంద


రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ లేఖలు

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి లేఖలు ప్రచురించాలని సంకల్పించాం. సాహితీ మిత్రుల వద్ద ఆయన లేఖలు ఉంటే మాకు వాట్సాప్‌ చేయాలని కోరుతున్నాం. వాట్సాప్‌ నంబర్స్‌: 9000642079, 9494815854  

కాళిదాసు పురుషోత్తం

Updated Date - 2021-04-12T05:48:21+05:30 IST