ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి లైవ్‌ వీడియో

ABN , First Publish Date - 2021-10-23T05:30:00+05:30 IST

లైవ్‌ ఫంక్షన్లను ఉపయోగించుకునే క్రియేటర్ల కోసం ప్రత్యేకించి రెండు ఫీచర్లను తీసుకువస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. దీని ప్రకారం...

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి లైవ్‌ వీడియో

లైవ్‌ ఫంక్షన్లను ఉపయోగించుకునే క్రియేటర్ల కోసం ప్రత్యేకించి రెండు ఫీచర్లను తీసుకువస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. దీని ప్రకారం క్రియేటర్లు 90 రోజులకు ముందునుంచే తమ కార్యక్రమాలను షెడ్యూల్‌ చేసుకోవచ్చు. వీక్షకులు కూడా సదరు ప్రోగ్రామ్‌కు రిమైండర్లను సెట్‌ చేసుకోవచ్చు. యూట్యూబ్‌, టిక్‌టాక్‌ మాదిరి సామర్థ్యం ఈ ఫీచర్‌కు ఉంటుంది.  ‘ప్రాక్టీస్‌ మోడ్‌’ పేరిట మరో ఫీచర్‌ను రూపొందిస్తోంది. దీంతో లైవ్‌కు ముందే అతిథులతో మాట్లాడుకోవచ్చు. తద్వారా వీడియో వీక్షణకు సంబంధించిన నాణ్యతను అసలు ప్రోగ్రామ్‌కు ముందే పరీక్షించుకోవచ్చు. ఐజీటీవీ వీడియో కాన్సెప్ట్‌, ఫీడ్‌ వీడియోను కలిపి ఒకటిగా ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోగా ప్రత్యక్షం కానుంది. ఫీడ్‌లో ఇకపై 60 నిమిషాల నిడివిగల వీడియోలను ఇకపై పోస్టు చేసుకోవచ్చు. హోంపేజీలో కుడివైపు టాప్‌ కార్నర్‌లో ప్లస్‌ గుర్తును టాప్‌ చేయడం ద్వారా సులువుగా వీడియోను పోస్టు చేసుకోవచ్చు. మెయిన్‌ పేజీపై మాత్రం 60 సెకెండ్లకు, అదే ప్రకటనైతే 15 సెకెండ్లకు పరిమితం. 

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST