కాలేయ సర్జరీల అవసరం ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-06-22T18:04:01+05:30 IST

కాలేయానికి మూడు సందర్భాల్లో సర్జరీలు అవసరం అవుతాయి. లివర్‌ సిస్ట్‌లు, గాల్‌ బ్లాడర్‌ లేదా బైల్‌ డక్ట్‌ స్టోన్స్‌, లివర్‌ కేన్సర్‌... ఈ మూడు సందర్భాల్లో కాలేయానికి సర్జరీలు చేయవలసి ఉంటుంది.

కాలేయ సర్జరీల అవసరం ఎప్పుడు?

ఆంధ్రజ్యోతి(22-06-2021)

కాలేయానికి మూడు సందర్భాల్లో సర్జరీలు అవసరం అవుతాయి. లివర్‌ సిస్ట్‌లు, గాల్‌ బ్లాడర్‌ లేదా బైల్‌ డక్ట్‌ స్టోన్స్‌, లివర్‌ కేన్సర్‌... ఈ మూడు సందర్భాల్లో కాలేయానికి సర్జరీలు చేయవలసి ఉంటుంది. 


లివర్‌ సిస్ట్‌

ఇవి కాలేయంలో చిన్న సైజులో ఒకటి లేదా రెండు ఉంటాయి. అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. కాలేయం మొత్తం కూడా వ్యాపిస్తేఅడల్ట్‌ పాలీసిస్టిక్‌ లివర్‌ డిసీజ్‌ అంటారు. పుట్టుకతో వచ్చే జన్యులోపాలు, పరాన్నజీవులతో కూడిన ఇన్‌ఫెక్షన్‌, చీముగడ్డలు, కాలేయ కేన్సర్లు కూడా లివర్‌ సిస్ట్‌లుగానే కనిపిస్తాయి. కడుపులో కుడివైపు నొప్పి, జ్వరం ప్రధాన లక్షణాలు. అల్ర్టాసౌండ్‌, సిటి స్కాన్‌, ఎమ్మారై పరీక్షలతో వీటిని గుర్తించవచ్చు. వీటిని ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో చికిత్స చేయవచ్చు.


గాల్‌ బ్లాడర్‌ లేదా బైల్‌డక్ట్‌లో రాళ్లు

కాలేయం నుంచి విడుదలయ్యే రసాలు బైల్‌ గొట్టాల నుంచి, గాల్‌ బ్లాడర్‌ గుండా ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో బైల్‌ గొట్టాలు, గాల్‌ బ్లాడర్‌లలో రాళ్లు ఏర్పడతాయి. కొలెస్ట్రాల్‌ పెరగడం, అధిక బరువుతో పాటు కొన్ని హెల్మింథియల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా కారణం కావచ్చు. కొన్నిసార్లు పుట్టుకతో వచ్చిన వాపు వల్ల (కొలిడోకల్‌ సిస్ట్‌) వస్తుంటాయి. కడుపులో కుడివైపు నొప్పి, చలిజ్వరం ప్రధాన లక్షణాలు. ఎల్‌.ఎ్‌ఫ.టి, అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌, ఎమ్మారైలతో వీటిని గుర్తించవచ్చు. ఎండోస్కోపిక్‌ అలా్ట్రసౌండ్‌ సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా పరీక్షించే వీలుంటుంది. ఈ రాళ్లను ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో తొలగించవచ్చు. బైల్‌ గొట్టాలలోని రాళ్లను ఎండోస్కోపీతో తొలగించవచ్చు. లిథోట్రిప్సీ, ఈఆర్‌సీపీ పద్ధతులతో కూడా తొలగించవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో హెపాటిక్‌ జెజునెస్టమీతో సమస్యను పరిష్కరించవచ్చు.


కాలేయ కేన్సర్‌

దీర్ఘకాలంగా మద్యపానం సేవించేవారు, హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి ఇన్‌ఫెక్షన్లకు గురైన వారికి కాలేయ కేన్సర్‌ సోకే అవకాశాలు ఎక్కువ. 3 నుంచి ఏడేళ్ల వయసు పిల్లల్లో కూడా కాలేయం కేన్సర్‌ (హెపటో బ్లాస్టోమా) కనిపించవచ్చు. కడుపు పైభాగంలో నొప్పి, బరువు తగ్గడం ప్రధాన లక్షణాలు. కామెర్లు, రక్త విరేచనాలు కూడా కనిపిస్తాయి. రక్తపరీక్ష, అలా్ట్రసౌండ్‌లతో, అవసరాన్ని బట్టి సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయవలసి ఉంటుంది. కేన్సర్‌ తొలి దశలో వ్యాధి సోకిన భాగాన్ని సర్జరీతో తొలగిస్తారు. ఆపరేషన్‌ చేయలేని పరిస్థితిలో టేస్‌, అబ్లేషన్‌ విధానాలతో మైక్రోవేవ్‌ అబ్లేషన్‌ చేస్తారు. 


జాగ్రత్తలు!

క్రమబద్ధమైన జీవనసరళి, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు ఎంతో కీలకం. మద్యపానానికి దూరంగా ఉంటూ, హెపటైటిస్‌ వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా కాలేయ కేన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చు.


డాక్టర్‌ ఆర్‌.వి రాఘవేంద్రరావు, 

M.S., M.Ch.,(SGPGI), F.H.P.B., F.L.T.,(SNUH)

సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌, డైరెక్టర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌, న్యూ ఎమ్మెల్యే కాలనీ, రోడ్‌ నెం. 12, 

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌ నం: 7993089995

email: drrvrrao@gmail.com


Updated Date - 2021-06-22T18:04:01+05:30 IST