‘వైఎస్‌ఆర్‌ చేయూత’తో పశువుల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-01T06:49:26+05:30 IST

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం నిధులతో పశువుల కొనుగోలు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

‘వైఎస్‌ఆర్‌ చేయూత’తో పశువుల పంపిణీ

రూ.470 కోట్లతో 62వేల యూనిట్లు


చిత్తూరు (వ్యవసాయం), నవంబరు 30: వైఎస్‌ఆర్‌ చేయూత పథకం నిధులతో పశువుల కొనుగోలు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. పాడి ఆవు, గేదెలలో ఏదైనా ఒకదానిని యూనిట్‌గా గుర్తించింది. గొర్రెలు లేదా మేకల్లో 14 ఆడ, ఒక మగజీవాన్ని కలిపి యూనిట్‌గా చేర్చింది. యూనిట్‌ ధరను రూ.75వేలుగా నిర్ధారించారు.  ఈ విధంగా 57,897 పాడిఆవులు, 3,069 గేదెల యూనిట్లతోపాటు 1,700 యూనిట్లకు సరిపడా 16,936 గొర్రెలు, 8,566 మేకల పంపిణీకి రూ.470 కోట్లు ఖర్చవుతుందని పశుసంవర్ధకశాఖ అధికారులు గుర్తించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సెర్ఫ్‌, డీఆర్డీఏ అధికారులు చేపట్టనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గ్గాలకు చెందిన 45-60 ఏళ్లున్న మహిళలు దీనికి అర్హులు. లబ్ధిదారులు రూ.18,750 మార్జిన్‌ మనీ కింద జమచేస్తే బ్యాంకు నుంచి రూ.56,250 లోనుగా మంజూరవుతుంది.

Updated Date - 2020-12-01T06:49:26+05:30 IST