సదుపాయాలకు దూరంగా జీవనం!

ABN , First Publish Date - 2021-05-25T05:34:57+05:30 IST

ఇప్పుడు ప్రజలు సకల సదుపాయాలు చెంతనే ఉండాలని కోరుకుంటున్నారు. లగ్జరీ జీవితానికి అలవాటుపడతున్నారు. కానీ గ్రీక్‌ దేశంలోని కరౌలియా అనే ప్రాంతంలో నివసించే ప్రజల జీవన

సదుపాయాలకు దూరంగా జీవనం!

ఇప్పుడు ప్రజలు సకల సదుపాయాలు చెంతనే ఉండాలని కోరుకుంటున్నారు. లగ్జరీ జీవితానికి అలవాటుపడతున్నారు. కానీ గ్రీక్‌ దేశంలోని కరౌలియా అనే ప్రాంతంలో నివసించే ప్రజల జీవన విధానాన్ని చూస్తే మాత్రం ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఆ విశేషాలు ఇవి...


  • కొండపైన ఇళ్లు... అక్కడికి చేరుకోవాలంటే నిటారుగా ఉన్న నిచ్చెన సహాయంతో ఎక్కాల్సిందే. అలాంటి చోట ఉండడం ఎందుకు? అంటే.... సంప్రదాయాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదని అంటారు వాళ్లు. ఇక్కడి ప్రజలు ఆర్థొడాక్స్‌ క్రిస్టియన్‌ మతాన్ని ఆచరిస్తుంటారు.
  • ప్రస్తుతం అక్కడ దాదాపు 20 సంప్రదాయ మఠాలున్నాయి. వీరు కూరగాయలు పండించడం, వైన్‌ తయారీ, చేపలు పట్టడం, వడ్రంగి, టైలరింగ్‌ పనులు చేస్తుంటారు. వీళ్లు నివసించే చిన్న చిన్న ఇళ్లను స్కెట్‌ అని పిలుస్తారు. తాళ్ల సహాయంతో ఇంటికి రాకపోకలు చేస్తుంటారు. వస్తువులను కూడా తాళ్లకు బుట్టలు కట్టి లాక్కుంటారు. 
  • అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వయసు పైబడిన వారు ఎన్ని రోజులైనా ఇంటికే పరిమితమైపోతారు. కొండ దిగి రావడం చేయరు.


Updated Date - 2021-05-25T05:34:57+05:30 IST