వామ్మో..ఒకటో తారీఖు !

ABN , First Publish Date - 2020-06-01T10:26:54+05:30 IST

మళ్లీ ఒకటో తా రీఖు వచ్చేసింది. దిగువ, మధ్యతరగతి గుండె ల్లో దడ మొదలైంది.

వామ్మో..ఒకటో తారీఖు !

నెల వారీ చెల్లింపులపై కలవరం

లాక్‌డౌన్‌తో జీవనం అస్తవ్యస్తం 


 ఒంగోలు(జడ్పీ), మే 31: మళ్లీ ఒకటో తా రీఖు వచ్చేసింది.  దిగువ, మధ్యతరగతి గుండె ల్లో దడ మొదలైంది. ఏ రోజుకారోజు ఆదా యంతో కుటుంబాలను నెట్టుకొచ్చే రోజువారీ కూలీలు, చాలీచాలని జీతాలతో బతుకుబండి సాగించే చిరుద్యోగులుతో పాటు వివిధ వర్గాల ప్రజలకు భయం పట్టుకుంది. కరోనా వైరస్‌ దెబ్బకు ఇప్పటికే రెండు నెలలకు పైగా ఉన్న లాక్‌డౌన్‌తో ఒక్క  రూపాయి ఆదాయం లేదు. చేతిలో ఉన్న కాస్త సొమ్ము ఇప్పటికే ఆవిరైపో యింది. జేబులు.. అకౌంట్లు ఖాళీ. అయితే ప్రతి నెలా కట్టాల్సిన కొన్ని చెల్లింపులు మాత్రం తరు ముకొస్తున్నాయి. వాటికి లాక్‌డౌన్‌తో సంబంధం లేదు. ఇంటి అద్దెలు, కరెంట్‌, పాల బిల్లులు, అ ప్పుల కిస్తీలు, చిరు వ్యాపారులయితే వారి దు కాణాల అద్దెలు ఒకటో తేదీన చెల్లింపులు చే యాల్సి ఉంటుంది. దీంతో వారంతా  అమ్మో ఒ కటో తారీఖా అని బెంబేలెత్తిపోతున్నారు. 


అసంఘటిత రంగ కార్మికుల వేదన 

లాక్‌డౌన్‌ బాధితులు ఎక్కువగా అసంఘ టితరంగంలోనే ఉన్నారు. జిల్లాలో దాదాపు 65 శాతం మందివి రెక్కాడితే గానీ డొక్కాడని బ తుకు చిత్రాలే. వీరంతా రెండు నెలలుగా పను ల్లేక విలవిల్లాడుతున్నారు. భవన నిర్మాణ కూలీ లు, హమాలీలు, తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, ఆటోవాలాలు, చిన్న హోటల్స్‌ నడుపుకునేవారు వీరి ఉపాధిపై కరోనా తీవ్ర మైన దెబ్బ కొట్టింది. వీరిలో ఎక్కువ మంది స్వయం శక్తి సహాయసంఘాల దగ్గర నుంచి రుణాలు తీసుకున్న వారు కూడా ఉంటారు.  ఆ రుణాల తాలూకు కిస్తీలను నెలకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగించడంతో  జూన్‌ నెలలో చెల్లింపులను తలచుకుంటే గండెల్లో దడ మొ దలవుతుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. 


ప్రైవేటు ఉద్యోగుల ఆందోళన 

చాలా కంపెనీలు మార్చినెల జీతాన్నే కట్‌ చేసి ఇచ్చాయి. కొన్ని కంపెనీలు అయితే మార్చి నెలజీతాన్ని ఇచ్చి సాగనంపాయి. ఇక ఈ నెల జీతాన్ని ఎంత కట్‌ చేసి ఇస్తారో... అన్న ఆందోళన ప్రైవేటు ఉద్యోగులలో వ్యక్త మవుతోంది.  వీరంతా కూడా వివిధరకాల లో న్స్‌, వాహనాల లాంటివి నెలవారీ వాయిదాల పద్ధతిలో తీసుకున్నారు. కరోనా దెబ్బకు వారు అల్లాడుతున్నారు.

Updated Date - 2020-06-01T10:26:54+05:30 IST