6500 కిలోమీటర్ల జర్నీ.. 24 గంటల తర్వాత సూట్‌కేస్‌ తెరచిన ఆమెకు సడన్ షాక్.. బ్రా లో..

ABN , First Publish Date - 2021-09-14T17:03:35+05:30 IST

ఒక బల్లి మహిళ బ్రాలో దాక్కుని విదేశీయానం చేసింది. బార్బడోస్ నుంచి వయా అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా బ్రిటన్‌లోని యార్క్‌షైర్ వరకు విమానంలో వెళ్లింది

6500 కిలోమీటర్ల జర్నీ.. 24 గంటల తర్వాత సూట్‌కేస్‌ తెరచిన ఆమెకు సడన్ షాక్.. బ్రా లో..

ఒక బల్లి మహిళ బ్రాలో దాక్కుని విదేశీయానం చేసింది. బార్బడోస్ నుంచి వయా అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా బ్రిటన్‌లోని యార్క్‌షైర్ వరకు విమానంలో వెళ్లింది. ఓ మహిళ బట్టల సూట్‌కేస్‌లో ఉన్న బ్రాలో దాక్కుని ఆ బల్లి అంతదూరం ప్రయాణించింది. లీసా రషెల్ అనే మహిళ ఇటీవల యార్క్ షైర్ నుంచి కరీబియన్ దీవులకు విహారయాత్రకు వెళ్లింది. అక్కణ్నుంచి ఆమె మంగళవారం తిరిగి ఇంటికి వెళ్లింది. 


ఇంటికి చేరుకున్న తర్వాత బట్టలు తీసేందుకు సూట్‌కేస్ ఓపెన్ చేయగా పైన ఉన్న బ్రాలో బల్లి కనిపించింది. `మొదట దాన్ని చూసినప్పుడు బ్రాపై ఏదో మరక పడిందనుకున్నా. బ్రాను పైకి తీయగానే బల్లి కిందపడి కదిలింది. దీంతో భయమేసి గట్టిగా అరిచాను. ఆ బల్లి నిజంగా లక్కీ. ఎందుకంటే వాతావరణం వేడిగా ఉండడంతో నేను ఆ బ్రా వేసుకోలేదు. అలాగే సూట్‌కేస్‌లో బట్టలను కుక్కేందుకు నేను దానిపై కూర్చున్నాను. అదృష్టవశాత్తూ బల్లికి ఏమీ కాలేద`ని లీసా తెలిపింది. ఇంగ్లండ్ వాతావరణంలో ఆ బల్లి మనుగడ సాగించలేదని భావించిన లీసా దానిని వ్యన్యప్రాణుల సంరక్షణ సమితికి అప్పగించింది. 



Updated Date - 2021-09-14T17:03:35+05:30 IST