వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజకు హాజరుకానున్న అద్వానీ, జోషి!

ABN , First Publish Date - 2020-08-01T21:09:12+05:30 IST

బీజేపీ సీనియర్ నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజకు హాజరుకానున్న అద్వానీ, జోషి!

న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య భూమి పూజకు హాజరు కానున్నట్లు సమాచారం. అయితే ట్రస్ట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా ధ్రువీకరించలేదు. ఇప్పటికైతే సీనియర్లైన ఉమా భారతి, కల్యాణ్ సింగ్‌కు భూమి పూజకు రావాల్సిందిగా ట్రస్ట్ ఆహ్వానం పలికింది. ఆగస్టు 5 న అయోధ్య రామ మందిర భూమిపూజ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం యోగి మరోసారి అయోధ్యను సందర్శించి... ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.


ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఆగస్టు 5 న ఉదయం 11: 15 గంటలకు అయోధ్యకు చేరుకుంటారు. మొదట హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన తర్వాతే భూమి పూజకు బయల్దేరుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై కేవలం ఐదుగురు మాత్రమే కనిపించనున్నారు. అందులో మొదటి వారు ప్రధాని మోదీ, రెండోవారు గవర్నర్, మూడోవారు సీఎం యోగి, నాలుగో వారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్, ట్రస్టు అధ్యక్షులు మాత్రమే వేదికపై ఆసీనులు కానున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. 


Updated Date - 2020-08-01T21:09:12+05:30 IST