మిషన్‌ మోడ్‌లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేపట్టాలి

ABN , First Publish Date - 2020-05-08T07:37:38+05:30 IST

జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లో డింగ్‌, అన్‌లోడింగ్‌ మిషన్‌మోడ్‌లో జరిగేలా మండల ప్రత్యేక అధికారులు

మిషన్‌ మోడ్‌లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేపట్టాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 7: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లో డింగ్‌, అన్‌లోడింగ్‌ మిషన్‌మోడ్‌లో జరిగేలా మండల ప్రత్యేక అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ కోరారు. సిరిసిల్ల పొదుపు భవన్‌లో ధాన్యం కొనుగో లుపై అధికారులతో గురువారం సమీక్షించారు.


వానాకాలం పంట సీజన్‌ ప్రారంభా నికి కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించే ప్ర క్రియను వేగవంతం చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ అంజయ్య, జడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి బుద్ధనాయుడు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి షాబోద్దీన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-08T07:37:38+05:30 IST