‘రీమష్‌’తో బోలెడంత ఫన్‌!

ABN , First Publish Date - 2020-07-25T05:30:00+05:30 IST

చైనా యాప్‌లపై వేటు పడటంతో భారతీయ యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. మేకిన్‌ ఇండియా పిలుపునకు స్పందించి యువత కొత్త యాప్‌లను క్రియేట్‌ చేసి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు...

‘రీమష్‌’తో బోలెడంత ఫన్‌!

చైనా యాప్‌లపై వేటు పడటంతో భారతీయ యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. మేకిన్‌ ఇండియా పిలుపునకు స్పందించి యువత కొత్త యాప్‌లను క్రియేట్‌ చేసి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా తెలుగు వాళ్లు రూపొందించిన ‘రీమష్‌’ యాప్‌ ఆ కోవకు చెందినదే. దీని ప్రత్యేకత ఏమిటంటే... టిక్‌టాక్‌ మాదిరిగా తక్కువ నిడివి గల వీడియోలు రూపొందించి షేర్‌ చేసుకోవచ్చు. చక్కటి వీడియో ఎడిటింగ్‌ టూల్స్‌ ఉన్నాయి.


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌(ఎఐ) సపోర్టుతో కంటెంట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. వీడియో టెంప్లేట్స్‌ను ఉపయోగించుకుని అద్భుతమైన వీడియోలు రూపొందించవచ్చు. స్టిక్కర్లు, ఎఫెక్ట్‌లు వీడియోల రూపకల్పనలో ఉపయోగించుకోవచ్చు. కావాలంటే బ్యౌక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను జత చేసుకోవచ్చు. ఫేస్‌స్వాప్‌, ఫొటోలూప్‌, మాంటేజ్‌, స్లో మోషన్‌, స్ప్లిట్‌ ఎఫెక్ట్‌ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ యాప్‌లో పదివేలకు పైగా స్టిక్కర్లు, రెండు వేలకు పైగా ఎఫెక్టులు, 2500లకు పైగా వీడియో టెంప్లేట్లు ఉన్నాయి. ఫేస్‌ స్వాప్‌ ఫీచర్‌ సహాయంతో వీడియో మీమ్స్‌ను రూపొందించి ఫేస్‌బుక్‌, హెలో వంటి సోషల్‌ నెట్‌వర్క్స్‌లో షేర్‌ చేయవచ్చు. ముఖ్యంగా వినియోగదారులు యాప్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఫోన్‌ కెమెరా సామర్థ్యం తక్కువగా ఉన్నా, యాప్‌ స్మార్ట్‌ కెమెరాతో నాణ్యమైన వీడియోలు చిత్రీకరించవచ్చు. యూజర్ల డేటా, ప్రైవసీకి ప్రాధాన్యం ఉంది. వినియోగదారులు తాము క్రియేట్‌ చేసుకున్న కంటెంట్‌కు వాటర్‌ మార్క్స్‌ను జత చేసుకోవచ్చు. మీ వీడియోలకు ఆదరణ పెరుగుతూ ఉంటే జెమ్స్‌ యాడ్‌ అవుతూ ఉంటాయి. ఆ జెమ్స్‌ని రీడిమ్‌ చేసుకుని షాపింగ్‌ చేయవచ్చు. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్‌ బాగా పనికొస్తుంది.

Updated Date - 2020-07-25T05:30:00+05:30 IST