Advertisement
Advertisement
Abn logo
Advertisement

లోన్‌ యాప్‌ కుంభకోణం..ఈడీ అధికారిపై కేసు

స్తంభింపజేసిన ఖాతాల్లోంచి డబ్బులు తీసుకునేందుకు లంచం

అపోలో ఇన్వెస్ట్‌ ఎండీ మిఖిల్‌ను 5లక్షలు డిమాండ్‌ చేసిన అధికారి

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ

జైల్లో ఉంటూనే నేరగాళ్ల నెట్‌వర్క్‌!

బరితెగించిన యాప్‌ నిందితులు


హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): మోసగాళ్ల పని పట్టాల్సిన బాధ్యత కలిగిన అధికారి.. వారితోనే కుమ్మక్కయ్యాడు. ఇన్‌స్టంట్‌ రుణాల పేరిట లోన్‌యా్‌పలతో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ నిందితులకు.. మరో నేరం చేసేలా సహకరించాడు. రూ.5 లక్షల లంచం తీసుకొని.. లోన్‌ యాప్‌ కుంభకోణం కేసులో స్తంభింపజేసిన ఫిన్‌వె్‌స్ట లోన్‌ యాప్‌ కంపెనీ బ్యాంకు ఖాతాను పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చాడు. దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ.. స్వయంగా ఈడీ అధికారే ఈ అవినీతి చర్యకు పాల్పడ్డట్లు గుర్తించింది. బెంగళూరుకు చెందిన ఈడీ అధికారి లలిత్‌ బజాద్‌ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ఫిర్యాదు మేరకు ఇన్‌స్ట్టంట్‌ మొబైల్‌ యాప్‌ లోన్‌ వ్యవహారంపై ఈడీ బెంగళూరు శాఖ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. కాగా, కేసు దర్యాప్తు అధికారిగా బెంగళూరు ఈడీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ మనోజ్‌ మిట్టల్‌ రాగా.. లలిత్‌ బజాద్‌ ఆయనకు సహాయకుడిగా ఉన్నారు. విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి ఫిబ్రవరి 9న హాజరు కావాల్సిందిగా ముంబైకి చెందిన అపోలో ఇన్వెస్ట్‌ ఎండీ మిఖిల్‌ ఇన్నానీకి లలిత్‌ ఈ-మెయిల్‌ రూపంలో సమన్లు జారీ చేశారు. అదే రోజు మిఖిల్‌ మరో ఇద్దరితో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ముగ్గురూ కలిసి బెంగళూరు నుంచి ఒకే విమానంలో ముంబైకి చేరుకున్నారు. బెంగళూరు పబ్‌లో లలిత్‌కు మిఖిల్‌ రూ.5 లక్షలు ఇచ్చాడు. హోసూరుకు చెందిన గ్రానైట్‌ వ్యాపారి సుని సూచన మేరకు భాటికి జైన్‌ ఆ డబ్బును ఇచ్డాఉ. మిఖిల్‌ బంధువు కోరిక మేరకు ఈ వ్యవహారమంతా నడిచినట్టు సీబీఐ పేర్కొంది. దీంతో అపోలో ఫిన్‌వె్‌స్ట బ్యాంక్‌ ఖాతా ఫిబ్రవరి 16న డీఫ్రీజ్‌ అయినట్టు తెలిపింది. 


జైల్లో ఉంటూనే బయట చక్రం.. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రుణాల యాప్‌ల కేసుల్లో నిందితులుగా ఉన్న వారు జైల్లో ఉండి కూడా బయట చక్రం తిప్పుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.30వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పీఎ్‌సలో 22 మంది అరెస్టయిన విషయం తెలిసిందే. వారిలో చైనా పౌరుడు మినహా మిగతా 21 మందికి బెయిల్‌ దొరికినా... ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు. కాగా, బెయిలు పొందిన నిందితులు బ్యాంకుల్లో ఫ్రీజ్‌ అయిన డబ్బును కూడా కాజేసేందుకు పథకాలు పన్నుతున్నారు. ఇప్పటికే 51 బ్యాంకు బ్రాంచ్‌లకు సైబర్‌క్రైమ్‌ పోలీసుల పేరిట ఫోర్జరీ లేఖలు రాసి డబ్బును విత్‌డ్రా చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకు అలీపూర్‌ శాఖ నుంచి రూ.1.18 కోట్లు ఇలా కాజేశారు. ఓ వ్యక్తి తనను తాను సైబర్‌క్రైమ్‌ ఎస్సైగా పరిచయం చేసుకుని.. ఓ ఫోర్జరీ పత్రాన్ని చూపి ఆ బ్యాంకులో ఉన్న 15 ఖాతాలకు సంబంధించిన రూ. 1.18 లక్షలను హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ ఖాతాకు తరలించి కాజేశాడు. ఏప్రిల్‌లోఈ ఘటన జరిగింది. అయితే  దీనికి సంబంధించి ఐసీఐసీఐ అలీపూర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌కు అనుమానం వచ్చి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 


1125 ఖాతాలపై కన్ను

తాజాగా ఫోర్జరీ పత్రాలు... నకిలీ వ్యక్తుల ప్రమేయం తో యాప్‌ల అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అవుతున్న మరో కుట్ర వెలుగు చూడటంతో మిగిలిన ఖాతాలపై అధికారులు దృష్టి పెట్టారు.  హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కేసుల్లో 1125 బ్యాంకు ఖాతాలు గుర్తించారు. నిందితులు అరెస్టు తర్వాత వారికి సంబంధించిన 1125 ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. ఆ ఖాతాల్లో రూ. 190 కోట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. కాగా, కోల్‌కతాలో సైబర్‌క్రైమ్‌ ఎస్సైనని చెప్పిన వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 


మళ్లీ యాప్‌ నిర్వాహకుల వేధింపులు

లోన్‌ యాప్‌ల నిర్వాహకులు మళ్లీ రెచ్చిపోతున్నారు. రుణాల వసూళ్ల్ల పేరుతో వేధింపులకు పాల్పడ్డ లోన్‌ యాప్‌ నిర్వాహకులపై పోలీసు కేసులు నమోదుకావడంతో కొంతకాలంగా వారంతా స్తబ్దంగా ఉన్నారు. అయితే తీసుకున్న రుణాన్ని వడ్డీతోపాటు తక్షణం చెల్లించాలంటూవేధిస్తున్నారంటూ పలువురు బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Advertisement
Advertisement