రైతుల ఖాతాల్లో రుణ మాఫీ సొమ్ము

ABN , First Publish Date - 2020-05-21T10:15:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చే సింది. 25 వేలలోపు పంటరుణాలు పొందిన 6,375 మంది రైతుల

రైతుల ఖాతాల్లో రుణ మాఫీ సొమ్ము

6,375 మంది రైతుల ఖాతాల్లో రూ.10.21 కోట్ల జమ       

చాలా మంది రైతులకు దక్కని రుణ మాఫీ


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చే సింది. 25 వేలలోపు పంటరుణాలు పొందిన 6,375 మంది రైతుల ఖాతాల్లో 10 కోట్ల 21లక్షల రూపాయలు జమచేశామని అధికారులు ప్రకటించారు. ఈ మేర కు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవు తున్నది. లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసేందుకు ఎన్నికల సంద ర్భంగా హామీఇచ్చిన ప్రభుత్వం 2014 ఏప్రిల్‌ నుంచి 2018 డిసెంబర్‌ 11వ తేదీ లోపు తీసుకున్న పంటరుణాల్లో లక్ష రూపాయల వరకు మాఫీ చేసింది.


25 వే లకు పైగా ఉన్న రుణాలను నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామ ని ప్రకటించగా, 25వేల రూపాయల వరకు ఉన్న రుణాలను ఒకేసారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. గత ఏడాదే ఈ రుణమాఫీ సొమ్మును ఒక విడ త జమచేయాల్సి ఉండగా ఏడాదిపాటు జాప్యం చేసింది. 25వేల వరకు రుణా లు పొందిన రైతులు జిల్లాలో 14,705 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఆధార్‌ లింకేజీ లేని రైతుల వివరాలు,ఒకే కుటుంబంలో ఇద్దరు పంట రుణాలు పొందిన వాటిని తొలగించారు. అవి పోనూ 6,405 మంది రైతులు ఉండగా, ప్ర స్తుతం 6,375 మంది రైతుల ఖాతాల్లో 10కోట్ల 21 లక్షల రూపాయలు జమ చే శామని సంబంధిత బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే చాలామంది రైతు ల ఖాతాలకు ఆధార్‌ లింకేజీ కాకపోవడంతో వారికి రుణమాఫీ దక్కకుండాపో తున్నది. ఒకే కుటుంబంలో ఇద్దరు రుణాలు పొందితే అందులో ఒక్కరికే రుణ మాఫీని వర్తింపజేస్తున్నారు. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ బుధవారం బ్యాంకు అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ అర్హులైన రైతులందరికీ చెందాలన్నారు. రుణమాఫీ పరంగా ఏమైనా స మస్యలు ఉంటే నెలరోజుల్లో మండల స్థాయిలో పరిష్కరించాలన్నారు.


ఆధార్‌ లింకేజీ లేని వాళ్ల కార్డులను అప్‌డేట్‌ చేయించి, వివరాలను ప్రభుత్వానికి పం పేలా వ్యవసాయ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావే శంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, డీసీఓ చంద్రప్రకాశ్‌రెడ్డి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ప్రేమ్‌కుమార్‌, ఆయా శాఖల బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-21T10:15:57+05:30 IST