మ్యాక్స్‌ సొసైటీ ద్వారా నెలకు రూ.20 లక్షల రుణాలు

ABN , First Publish Date - 2022-03-02T06:15:19+05:30 IST

Loans of Rs.20 lakhs per month through Max‌ Society

మ్యాక్స్‌ సొసైటీ ద్వారా నెలకు రూ.20 లక్షల రుణాలు
సమావేశంలో మాట్లాడుతున్న మ్యాక్స్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ శారద


చైర్‌పర్సన్‌  శారద 

చింతపల్లి, మార్చి 1: ఆదివాసీల వ్యవసాయ అభివృద్ధికి నెలకు రూ.30 లక్షల మేరకు రుణాలు మంజూరు చేసేందుకు తీర్మానించామని మహిళా మాతోట మ్యాక్స్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ లోచలి శారద అన్నారు. మంగళవారం మహిళా మాతోట మ్యాక్స్‌ సొసైటీ సీఈవో నెల్లూరి వెంకట సత్యనారాయణ అధ్యక్షతన డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2018లో రెండు వేల మంది మహిళా సభ్యులతో ప్రారంభమైన మహిళా మాతోట మ్యాక్స్‌ సొసైటీలో ప్రస్తుతం నాలుగు వేల మంది సభ్యులున్నారన్నారు. ప్రస్తుతం మ్యాక్స్‌ సొసైటీలో రూ.రెండు కోట్ల పొదుపు నిధులున్నాయన్నారు. ప్రస్తుతం నెలకు రూ.20 లక్షల రుణాలు సభ్యులకు మంజూరు చేస్తున్నామన్నారు. మ్యాక్స్‌ సొసైటీ ద్వారా రుణాలు తీసుకుంటున్న మహిళలు సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ ప్రగతి సాధించాలని ఆమె ఆకాంక్షించారు.


 

Updated Date - 2022-03-02T06:15:19+05:30 IST