Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 5 2021 @ 09:19AM

మూడు విడతలుగా నగరపాలక ఎన్నికలు

                    - 13లోగా నోటిఫికేషన్‌ జారీ?


చెన్నై: రాష్ట్రంలో కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 13లోపున నోటిఫికేషన్‌ జారీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమవుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు డిసెంబర్‌లో నగర పాలక సంస్థలకు కూడా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి వుండటంతో రాష్ట్ర ఎన్నికల అధికారి పళని కుమార్‌ గత నెలరోజులకు పైగా వార్డుల పునర్వి భజన, ఓటర్ల జాబితాల సవరణ పనులలో తలమున కలవుతున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన కార్పొరేష న్లు, మునిసిపాలిటీలలో వార్డుల విభజన పనులు కూడా పూర్తయ్యాయి. నగరపాలక సంస్థల ఎన్నికలకు గాను ఈనెల తొమ్మిదిన ఓటర్ల తుదిజాబితా విడుదల చేయనున్నట్టు ఎన్నికల అధికారి పళనికుమార్‌ ఇటీవల ప్రకటించారు. ఓటర్ల తుది జాబితా విడుదలై చేసిన మీదట ఈనెల 13లోపున ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడానికి ఆయన తగు చర్యలు చేపడుతున్నారు. కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికలను మూడు విడతలుగా జరపాలని భావిస్తున్నారు. తొలివిడతగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత రెండు విడతలుగా కార్పొరేషన్‌ ఎన్నికలు జరపాలని అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారి పళనికుమార్‌ త్వరలో జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించ నున్నారు. ఈ నెలాఖరులోపున వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికలు సంక్రాంతి తర్వాతే జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 13 లోపున జారీ చేయనున్నట్ట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement