‘స్థానిక’ ఉపఎన్నికలకు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-10-23T06:37:13+05:30 IST

జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న సర్పంచ్‌లు, పంచాయతీ వార్డు సభ్యులు, మున్సిపల్‌ వార్డు సభ్యు ల నగరపాలక సంస్థ కార్పొరేటర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది.

‘స్థానిక’ ఉపఎన్నికలకు సన్నద్ధం

కాకినాడ సిటీ/కార్పొరేషన్‌/భానుగుడి(కాకినాడ), అక్టోబ రు 22: జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న సర్పంచ్‌లు, పంచాయతీ వార్డు సభ్యులు, మున్సిపల్‌ వార్డు సభ్యు ల నగరపాలక సంస్థ కార్పొరేటర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. కాకినాడ నగరపాలక సంస్థకు సంబంధించి 3, 9, 16, 30 డివిజన్లలో ఎన్నికలు నిర్వహణకు, పిఠాపురం మున్సిపాలిటీ 11వవార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఆరు పంచాయతీలకు సర్పంచ్‌ ఎన్నికలు, 47 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ఓటర్‌ లిస్ట్‌లు, పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. వీటితోపాటు ఖాళీగా ఉన్న 7 ఎంపీటీసీ స్థానాలకు, రెండు జడ్‌పీటీసీ స్థానాలకు ఓటర్‌ లిస్ట్‌, పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేసుకునే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. 

Updated Date - 2021-10-23T06:37:13+05:30 IST