Abn logo
Sep 16 2021 @ 00:00AM

ఎఫ్‌టీఎల్‌లో అక్రమ ప్లాట్ల ఏర్పాటును అడ్డుకున్న స్థానికులు

సంగారెడ్డిలోని దూద్‌బాయ్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌లో ప్లాట్ల కోసం చదును చేసిన దృశ్యం

సంగారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 16 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని దూద్‌బాయ్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌లో బుధవారం రాత్రి కొంతమంది వ్యక్తులు ఎక్స్‌కవేటర్‌తో అక్రమంగా ప్లాట్లను చేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో సదరు వ్యక్తులు స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రియల్టర్లతో పనులు నిలిపివేయించారు. ఇదిలా ఉండగా 1వ వార్డు పరిధిలోని దూద్‌బాయ్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న 27 గుంటల్లో అనుమతి లేకుండానే కొంతమంది ప్లాట్లుగా చేయాలని ప్రయత్నిస్తున్నారని స్థానికులు గురువారం కలెక్టర్‌ హన్మంతరావుకు, ఇరిగేషన్‌ ఈఈ మధుసూదన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.