తమిళనాడులో లాక్‌డౌన్ సమయం కుదింపు

ABN , First Publish Date - 2020-04-05T21:32:02+05:30 IST

తమిళనాడులో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో పళని స్వామి నేతృత్వంలోని సర్కార్ అప్రమత్తమైంది. లాక్‌డౌన్ వెసులుబాటు సమయాన్ని

తమిళనాడులో లాక్‌డౌన్ సమయం కుదింపు

చెన్నై : తమిళనాడులో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో పళని స్వామి నేతృత్వంలోని సర్కార్ అప్రమత్తమైంది. లాక్‌డౌన్ వెసులుబాటు సమయాన్ని తగ్గించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రజలు బయటికి వచ్చి తమ నిత్యావసరాలను కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం నూతన ఆంక్షలు విధించింది. ఇప్పటికే 485 మందికి కోరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.  మరోవైపు ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటంపై ముఖ్యమంత్రి పళని స్వామి స్పందించారు.  అలాంటి ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ అనేది ఎవర్నైనా ఇబ్బంది పెడుతుందని, దానికి కులం, మతం లేదని తెలిపారు. సమాజంలోని ప్రజలందర్నీ గౌరవించాలని పళని స్వామి సూచించారు. 


Updated Date - 2020-04-05T21:32:02+05:30 IST