Abn logo
May 28 2020 @ 12:45PM

నెలసరీ లాక్‌డౌన్‌!

ఆంధ్రజ్యోతి(28-05-2020)

లాక్‌డౌన్‌ సామాజికపరమైన అంశమే కాదు, భౌతికపరమైనది కూడా! దాని ప్రభావం మహిళల నెలసరినీ ఛిద్రం చేసింది. నిరంతరం నానా అగచాట్లు పడుతూ గాడిలో పెట్టుకునే నెలసరిని, లాక్‌డౌన్‌ ఒక్క దెబ్బతో చిన్నాభిన్నం చేసేసింది. ఆ స్థితికి లోనయిన ఓ మహిళ మనోగతం ఇది!


‘‘రెండు నెలల లాక్‌డౌన్‌ కాలంలో ఎక్కడికక్కడ కార్యక్రమాలన్నీ నిలిచిపోయినట్టే, నా నెలసరి కూడా నిలిచిపోయింది. పూర్తి దేశంతో పాటు నా గర్భసంచీ కూడా లాక్‌డౌన్‌కు గురైనట్టుంది. గత రెండేళ్లుగా దారి తప్పుతూ తిరిగే నా నెలసరిని గాడిలో పెట్టడం కోసం వ్యాయామాలు చేశాను, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాను. అయినా తుంటరిగా తప్పించుకుని తిరిగే దాన్ని ఒక్కోసారి మందులతో కంట్రోల్‌ చేయక తప్పేది కాదు. గజిబిజిగా మారిన హార్మోన్‌ స్రావాలతో నెలసరి నొప్పులు చాచి పెట్టి కొడుతూ ఉండేవి. ఈ సమస్యకు కారణం నేనే. టీనేజీలో నా అధిక బరువు నెలసరి మీద కూడా పడుతుందని ఆలస్యంగా తెలిసొచ్చింది. బరువు తగ్గాలని డాక్టర్‌ పదే పదే పోరు పెట్టడంతో, కష్టపడి బరువు తగ్గించుకోగలిగాను. దాంతో నెలసరి ఠంచనుగా ప్రతీ నెలా ఒకే రోజున హాజరు వేయించుకునేది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు. నెలసరి మళ్లీ మొండికేయడం మొదలు. ఒక్కోసారి అలకబూని కనిపించడమే మానేస్తే, ఇంకోసారి వచ్చి ఇక వెళ్లనంటూ మొండికేసేది. రెండూ సమస్యలే! రెండింటితోనూ అలుపెరగని పోరాటం చేశాను. ఎలాగోలా అన్నీ సర్దుకుని నెలసరి దారిలో పడింది అనుకుంటున్న సమయంలో లాక్‌డౌన్‌ వచ్చిపడింది.


లాక్‌డౌన్‌ కాబట్టి వ్యాయామం మానుకున్నాను అనుకుంటే పొరపాటు. ఇంట్లో రోజుకు కనీసం పది వేల అడుగులు నడిచే ప్రయత్రం చేశాను. కానీ నడిచే దారిలో పిల్లల ఆటవస్తువులు, ఫర్నిచర్‌ అడ్డు తగిలేవి. లాక్‌డౌన్‌ కారణంగా ఒత్తిడి పెరిగి, పరిస్థితి మరింత దిగజారింది. డాక్టర్‌ను కలిస్తే హార్మోన్‌ మాత్రలు సూచించారు. వాటితో ఒరిగే లాభం మాట పక్కన పెడితే, తీపి వస్తువుల మీదకు మనసు మళ్లడం, ఏకబిగిన మూడు ఐస్‌క్రీమ్‌లు లాగించేయడం నాకు అలవాటైంది. అదుపుతప్పే భావోద్వేగాలు, జిహ్వచాపల్యాలు అతలాకుతలం చేసే స్థితి అనుభవిస్తేనే అర్థం అవుతుంది. ఇదీ మహిళల నెలసరిపై లాక్‌డౌన్‌ చూపిస్తున్న ప్రభావం. నాలా ఇబ్బందులు పడే మహిళలు అంతటా ఉంటారని నాకు తెలుసు. నాకు ఉన్నటువంటి సదుపాయాలు, సౌలభ్యాలు కూడా లేని మహిళలూ ఉన్నారు. జార్ఖండ్‌లోని జోనా ప్రాంతంలో లాక్‌డౌన్‌ మూలంగా శానిటరీ న్యాప్కిన్స్‌ దొరకక ఆకులు, పొట్టు వాడుతున్న మహిళలు ఉన్నారు. ఈ సమస్యల గురించి బహిరంగంగా చర్చించుకునే పరిస్థితీ మన సమాజంలో లేకపోవడం మరింత శోచనీయం.’’


లాక్‌డౌన్‌ కాబట్టి వ్యాయామం మానుకున్నాను అనుకుంటే పొరపాటు. ఇంట్లో రోజుకు కనీసం పది వేల అడుగులు నడిచే ప్రయత్రం చేశాను. కానీ నడిచే దారిలో పిల్లల ఆటవస్తువులు, ఫర్నిచర్‌ అడ్డు తగిలేవి. లాక్‌డౌన్‌ కారణంగా ఒత్తిడి పెరిగి, పరిస్థితి మరింత దిగజారింది. డాక్టర్‌ను కలిస్తే హార్మోన్‌ మాత్రలు సూచించారు. వాటితో ఒరిగే లాభం మాట పక్కన పెడితే, తీపి వస్తువుల మీదకు మనసు మళ్లడం, ఏకబిగిన మూడు ఐస్‌క్రీమ్‌లు లాగించేయడం నాకు అలవాటైంది. అదుపుతప్పే భావోద్వేగాలు, జిహ్వచాపల్యాలు అతలాకుతలం చేసే స్థితి అనుభవిస్తేనే అర్థం అవుతుంది. ఇదీ మహిళల నెలసరిపై లాక్‌డౌన్‌ చూపిస్తున్న ప్రభావం. 

ప్రత్యేకంమరిన్ని...