పది రోజులు కర్ఫ్యూ వేళ్లల్లో మార్పులు: అనిల్ కుమార్ సింఘాల్

ABN , First Publish Date - 2021-06-21T00:25:54+05:30 IST

పది రోజులు కర్ఫ్యూ వేళ్లల్లో మార్పులు: అనిల్ కుమార్ సింఘాల్

పది రోజులు కర్ఫ్యూ వేళ్లల్లో మార్పులు: అనిల్ కుమార్ సింఘాల్

ప్రకాశం: కొవిడ్ కేసులు తగ్గుతున్నందున కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. సోమవారం నుంచి తూర్పుగోదావరి జిల్లా మినహా 12 జిల్లాల్లో మరో పది రోజుల పాటు సాయంత్రం ఆరు గంటల వరకూ మినహాయింపులు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేసులు తగ్గుతున్నా కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు డోసులు వాక్సిన్ తీసుకున్నవారు కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. థర్డ్ వేవ్‌లో చిన్నారులపై ఎక్కువ ప్రభావం ఉంటుందనే వార్తలలో స్పష్టత లేదని చెప్పారు. నిన్నటి వరకూ ఏపీలో కోటి 23 లక్షల16 వేల 609 మందికి వాక్సిన్‌ వేశామన్నారు. థర్డ్ వేవ్ వచ్చినా, రాకపోయినా వైద్య శాఖ సన్నద్ధంగా ఉందని అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-21T00:25:54+05:30 IST