లాక్‌డౌన్‌ కష్టాలను ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకురండి!

ABN , First Publish Date - 2020-04-10T13:33:29+05:30 IST

నగరానికి చెందిన ఒకరు నిత్యావసర సరుకులు కొనుగో లు చేసేందుకు సూపర్‌ మార్కెట్‌కు వెళ్లారు.

లాక్‌డౌన్‌ కష్టాలను ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకురండి!

  • వాట్సాప్‌ నంబర్‌  99854 11079


హైదరాబాద్: నగరానికి చెందిన ఒకరు నిత్యావసర సరుకులు కొనుగో లు చేసేందుకు సూపర్‌ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ తనకు కావాల్సిన సరుకులన్నీ కొనుగోలు చేశాడు. అందులో ఇల్లు శుభ్ర పర్చుకునేందుకు చీపురు కూడా తీసుకున్నాడు. బిల్లింగ్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లగా, అక్కడున్న వ్యక్తి చీపురుకు బిల్లు వేయడం కుదరదని, లాక్‌డౌన్‌ నిబంధనల్లో చీపురు నిత్యావసర సరుకు కింద రాదని చెప్పాడు. వాస్తవానికి ఇల్లు శుభ్ర పర్చుకోవడం ముఖ్యమే. దీనికి చీపురు అవసరం. కానీ, అది నిత్యావసర వస్తువు కింద చేర్చలేదు. సదరు వ్యక్తికి ఈ విషయం ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తెలియలేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇలాంటి సమస్యలు అనేకం ఎదురవుతుంటాయి.


ఇలాంటి వాటిని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావాలని సంకల్పించింది. ఎవరికైనా ఇబ్బంది కలిగితే మా దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారికి సమాచారం ఇవ్వడంతో పాటు పత్రికలో ప్రచురిస్తాం. మీ కష్టాలను మాకు కేవలం వాట్సాప్‌ రూపంలో మాత్రమే  99854 11079 నెంబరుకు పంపించగలరు.

Updated Date - 2020-04-10T13:33:29+05:30 IST