లాక్‌డౌన్‌ సడలింపులపై నేడు CM సమావేశం

ABN , First Publish Date - 2021-10-23T13:33:19+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలింపులపై నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం అధికారులతో చర్చించనున్నారు. శనివారం ఉదయం 11.20 గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఆ

లాక్‌డౌన్‌ సడలింపులపై  నేడు CM సమావేశం

చెన్నై(Tamilnadu): రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలింపులపై నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం అధికారులతో చర్చించనున్నారు. శనివారం ఉదయం 11.20 గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ప్రస్తుతం రాజకీయ సభలు, సాంస్కృతిక సమావేశాలు నిర్వహించడంపై నిషేధం అమలులో ఉంది. బస్సుల్లో, సినిమా థియేటర్లలో 50 శాతం మంది ప్రజలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ రెండు మూడు కట్టుబాట్లను తొలగించాలా? లేక కొనసాగించాలా? అనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అదే సమయంలో దీపావళి తదితర పండుగలకు కొత్త సడలింపులను ప్రకటించడం లేదా మరిన్ని నిబంధనలు విధించే అంశాలపై కూడా స్టాలిన్‌ సమీక్షించనున్నారు.

Updated Date - 2021-10-23T13:33:19+05:30 IST