కొత్తగా ఆస్వాదిద్దాం!

ABN , First Publish Date - 2020-03-25T06:19:00+05:30 IST

కరోనా భయం నేపథ్యంలో ఇప్పుడు ఇల్లే ప్రపంచం. అయితే లాక్‌డౌన్‌ మూలంగా స్వీయనిర్బంధంలో ఉంటూ రోజంతా టీవీ, ఫోన్‌ చూస్తూ గడపడం బోర్‌ అనిపిస్తుంది. అలాంటప్పుడు గార్డెనింగ్‌, కొత్త వంటలు...

కొత్తగా ఆస్వాదిద్దాం!

కరోనా భయం నేపథ్యంలో ఇప్పుడు ఇల్లే ప్రపంచం. అయితే లాక్‌డౌన్‌ మూలంగా స్వీయనిర్బంధంలో ఉంటూ రోజంతా టీవీ, ఫోన్‌ చూస్తూ గడపడం బోర్‌ అనిపిస్తుంది. అలాంటప్పుడు గార్డెనింగ్‌, కొత్త వంటలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వ్యాపకాలు పెట్టుకోవాలి. తద్వారా మనసూ, శరీరం ఉత్సాహంగా మారతాయి. కొత్త ఏడాది మొదలవుతున్న ఈ ఉగాది రోజు నుంచి ఇలా చేద్దాం!


గార్డెనింగ్‌: ప్రకృతికి దగ్గరగా ఉండడం ఎప్పుడూ మంచిదే! ఎలాగూ పొద్దంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి గార్డెనింగ్‌ చేపట్టండి. డాబా మీద లేదా బాల్కనీలో కుండీల్లో మొక్కల్ని పెంచండి. గదిలో మీకిష్టమైన ప్రాంతంలో చిన్నగా ఉండే అలంకరణ మొక్కల్ని ఉంచాలి. గాలిని శుద్ధిచేసే అలోవెరా, ఇంగ్లిష్‌ ఐవీ, చేమంతి, బార్బెర్టన్‌ డైసీ వంటి మొక్కలను పెంచితే  ఇల్లంతా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. 


గరిటె తిప్పండి: ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాల్లో వంట చేయడం ఒకటి. రుచికరంగా ఉండే కొత్తరకం సలాడ్స్‌, స్నాక్స్‌ తయారుచేయండి. కొత్త వంటకం నేర్చుకొని ఇంట్లోవాళ్లను ఆశ్చర్యపరచండి! 


వ్యాయామం తప్పనిసరి: జిమ్‌లో వర్కవుట్లు చేసే అలవాటును ఇంట్లో కూడా కొనసాగించాలి. అయితే ఇంటి వద్ద అందుబాటులో ఉన్న వస్తువులతో తేలికైన ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ముందుగా ఇంట్లోని ఫర్నిచర్‌ను చక్కగా సర్ది ఎక్సర్‌సైజ్‌లు చేసేందుకు స్థలం ఏర్పరచుకోవాలి. కాలి కండరాలు దృఢంగా మారేందుకు మెట్లు ఎక్కి దిగాలి. పూల కుండీలు వెయిట్‌లిఫ్టింగ్‌ పరికరాలుగా పనికొస్తాయి. వాటిని ఒకచోట నుంచి మరోచోటుకు మారుస్తూ వ్యాయామం చేయండి.


అందానికి మెరుగులు: ఈ పరిస్థితుల్లో స్పా, సెలూన్‌కు వెళ్లలేకపోతున్నామనే బెంగ అవసరం లేదు. ఇంట్లోనే అందానికి మెరుగులు దిద్దుకోండి. ప్యూమిస్‌ స్టోన్‌తో పాదాల అంచుల వెంబడి రుద్దుకుంటే చర్మం మీది మృతకణాలు తొలగిపోతాయి, అలాగే ఎప్సమ్‌ లవణం కలిపిన నీళ్లలో పాదాలను కొద్దిసేపు ఉంచితే స్పాలో ఉన్న అనుభూతి వస్తుంది. వీటితో పాటు నచ్చిన పుస్తకం చదవడం, టీవీ చూడడం లేదా సంగీతం వినడం కోసం కొంత సమయం కేటాయుర చండి.

Updated Date - 2020-03-25T06:19:00+05:30 IST