Abn logo
Apr 2 2020 @ 16:46PM

లాక్‌డౌన్ నేపథ్యంలో ఊరు మొత్తానికి కూరగాయలు పంపిణీ

విశాఖ: లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరి ఇళ్లకు వాళ్లే పరిమితమయ్యారు. గత 10 రోజులుగా పనులు లేక నిత్యవసరాలు కూడా సరిగ్గా అందని పరిస్థితి. దీంతో నగరాల్లో, గ్రామాల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి.. పలు కుటుంబాలకు నిత్యవసరాలు అందిస్తున్నాయి. జిల్లాలోని ఎస్.రాయవరం మండలంలోని వమ్మవరం గ్రామానికి చెందిన స్థానిక నేతలు, యువజన సంఘం నాయకులు ఊరు మొత్తానికి కూరగాయలు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. మార్కెట్లు లేక జనం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. తుని నుంచి కూరగాయలు తెప్పించి ఇంటింటికీ తిరిగి అందజేశారు. ఈ కార్యక్రమంలో సుంకర సతీశ్, గొంతిన సత్తిబాబు, రాయవరపు నాగేశ్వరరావు, పాలపర్తి పాపారావు, బాలం సూరిబాబు, గరికిపాటి సతీశ్, కర్రి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement