వాళ్లు అలా.. వీళ్లు ఇలా.. ఇదేమి న్యాయం?

ABN , First Publish Date - 2020-03-30T17:46:51+05:30 IST

కోవిడ్-19(కరోనావైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి.

వాళ్లు అలా.. వీళ్లు ఇలా.. ఇదేమి న్యాయం?

హైదరాబాద్: కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందనలు తెలిపింది. కరోనా విషయం తెలియగానే అమెరికా, ఇటలీ తదితర దేశాల్లో ఉన్నవాళ్లను స్వదేశానికి రప్పించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశాయి. పైలట్లు ప్రాణాలు పణంగా పెట్టి అక్కడికి వెళ్లి వారిని తీసుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. మెరుగైన జీవితం అంటూ విదేశాలకు వెళ్లిన వారి కోసం అంతగా ప్రయాస పడుతున్న ప్రభుత్వాలకు... కరోనా ఎఫెక్ట్‌తో నగరాల్లో ఉండలేక సొంతూళ్లకు నడుచుకుంటూ వెళుతున్న వాళ్లు కనపడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. రవాణా సౌకర్యం లేక నెత్తిన మూటలు పెట్టుకుని దురాభారాలు లెక్క చేయకుండా నడుచుకుంటూ వెళుతున్న వారిని ఆదుకునే వారే లేరా అని అడుగుతున్నారు. 



‘‘ఎక్కడో విదేశాల్లో ఉన్న వారి గురించి ఆరాటపడ్డ వారు... ఈ నేలపై ఉంటూ ఈ దేశనిర్మాణంలో చెమటచుక్కలు చిందిస్తున్న వారిని కాపాడుకోలేరా? పిల్లాపాపలతో మైళ్లమైళ్లకు నడుచుకుంటూ వెళుతున్న వీరికి మనమిచ్చేదేమిటి?’’ అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి.



Updated Date - 2020-03-30T17:46:51+05:30 IST