Abn logo
Mar 26 2020 @ 17:13PM

ఇంతమంది చెప్పేది ఒకే విషయం.. మీరూ ఆలోచించండి!

దేశమంతా లాక్‌డౌన్‌ నడుస్తోంది. బయటకు రాకుండా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కోవిడ్ - 19 బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ సందర్భంగా సినీ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.  పలువురు సినీ ప్రముఖులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేక సందేశాలు పంపారు. సెల్ఫీ వీడియోలు సందేశాత్మకంగా ఉన్నాయి.      


సమీరా రెడ్డి: ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో పిల్లలతో సమయాన్ని గడపండి. ఓ తల్లిగా చెబుతున్నా.. ఇంట్లోనే ఉంటూ వాళ్లకు ప్రేమను పంచండి. ప్రభుత్వ ఆదేశాలను పాటించండి. 

మురళీ శర్మ: ఇంట్లోనే ఉండండి. భద్రంగా ఉండండి. అత్యవసర పరిస్థితి లేనప్పుడు ఇంటికే పరిమితమవ్వండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. సంతోషంగా ఉండండి. 

సురేశ్ ఒబెరాయ్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇది యుద్ధం. మనం గెలవాలి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ... సామాజిక దూరాన్ని పాటించండి. శుభ్రంగా ఉండండి. ప్రాణాలను పణంగా పెట్టొద్దు. మన కోసం డాక్టర్లు, పోలీసులు, ఆర్మీ, పైలట్లు అందరూ పని చేస్తున్నారు. మన డ్యూటీ మనం చేద్దాం.  



శ్రద్ధాదాస్: మన కోసం కష్టపడుతున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనవరి నుంచే నేను కరోనా గురించి వింటున్నాను. 14 రోజులుగా ఇంటికే పరిమితమయ్యాను. మానసికంగా సంసిద్ధురాలినయ్యా. యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. శారీరకంగానూ ఫిట్‌గా ఉంటున్నాను. బుద్ధిజమ్ అభ్యసిస్తున్నాను. రోజూవారీ కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలపై ఆలోచించాలి. 



సంజన: ప్రతి సమస్యను నవ్వుతూ ఎదుర్కొంటాను. అది నా స్వభావం. ఇది దేశానికి సంబంధించిన సమస్య కాదు.. ప్రపంచానికి సంబంధించినది. రెండు నిమిషాలే కదా అని బయటకు వెళితే.. మొత్తం కుటుంబానికే ప్రమాదరకంగా పరిణమిస్తుంది. 



ముఖేశ్ రుషి: కరోనాను అందరూ ప్రమాదకరంగా భావించాలి. ఉన్నవారిని తాకితే వచ్చేస్తుంది. లాక్ డౌన్ అందరూ పాటించాలి. బయటకు వెళ్లాలనుకుంటే ఒకరు మాత్రమే వెళ్లాలి. నేను కొన్ని రోజులుగా అదే చేస్తున్నాను. ప్రభుత్వ ఆదేశాలను పాటిద్దాం. ఇంటికే పరిమితమవుదాం. 




కిరణ్ డెంబ్లా(ఫిట్‌నెస్ గురు): ఎప్పిటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉంటాం. శుభ్రత పాటిస్తున్నాము. పిల్లలకు కూడా నేర్పించాము. సూపర్ మార్కెట్ ‌కు వెళ్లొచ్చినా... చాలా జాగ్రత్తపడుతున్నాము. ప్రభుత్వం చెప్పింది చేయండి. అందరూ ఇళ్లల్లో నే ఉండండి. క్వారంటైన్ అవ్వండి. 

Advertisement
Advertisement
Advertisement