Abn logo
Apr 2 2020 @ 14:18PM

మందులషాపులపై లాక్‌డౌన్ ఎఫెక్ట్

ఖమ్మం: రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా ఖమ్మం జిల్లాలో మందులకు కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మెడికల్ షాపుల్లో మందుల కొరత ఏర్పడుతోంది. ఖమ్మంజిల్లాలో లాక్‌డౌన్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కరోనాముప్పు ఏ రూపంలో పొంచివస్తోందోన్న భయం నెలకొంది. మందులషాపుల వద్ద పెద్ద రద్దీ కనిపిస్తోంది. జనాలు సామాజిక దూరం పాటిస్తున్నారు. మందులు బయట నుంచి రావడంలేదని దీంతో మందుల కొరత ఏర్పడిందని మెడికల్ షాపు నిర్వహాకులు ఏబీఎన్‌కు తెలిపారు. లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ సరఫరా చేసేమందులను మాత్రమే అమ్ముతున్నామని తెలిపారు. కొనుగోలుదారులు కూడా రెండు, మూడు నెలలకు సరిపడ మందులు కొనుగోలు చేస్తున్నారని, దీంతో మందుల కొరత ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement