కేరళలో మే 8 నుంచి లాక్‌డౌన్: ప్రకటించిన సీఎం పినరయి

ABN , First Publish Date - 2021-05-06T22:05:18+05:30 IST

కేరళలో బుధవారం రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. 37,190 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి

కేరళలో మే 8 నుంచి లాక్‌డౌన్: ప్రకటించిన సీఎం పినరయి

తిరువనంతపురం: కేరళలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించబోతున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. లాక్‌డౌన్ ఈ నెల 8న ప్రారంభై  16 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. గురువారం తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘కేరళ రాష్ట్రం మొత్తం మే 8 ఉదయం 6 గంటల నుంచి లాక్‌డౌన్‌లోకి వెళ్తుంది. ఈ లాక్‌డౌన్ ఈ నెల 16 వరకు కొనసాగుతుంది. కోవిడ్ సెకండ్-19 సెకండ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పలేదు’’ అని అన్నారు.


కేరళలో బుధవారం రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. 37,190 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా 57 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. ఇక  గురువారం 18,789 కొత్త కేసులు, 58 మరణాలు నమోదు అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2021-05-06T22:05:18+05:30 IST