పెంటగాన్‌‌లో లాక్‌డౌన్ తొలగింపు

ABN , First Publish Date - 2021-08-04T08:41:47+05:30 IST

కాల్పుల కలకలం నేపథ్యంలో లాక్‌డౌన్‌లోకి వెళ్లిన అమెరికా రక్షణ శాఖ కేంద్రం పెంటగాన్ తిరిగి తెరుచుకుంది. కార్యకలాపాలు..

పెంటగాన్‌‌లో లాక్‌డౌన్ తొలగింపు

వాషింగ్టన్: కాల్పుల కలకలం నేపథ్యంలో లాక్‌డౌన్‌లోకి వెళ్లిన అమెరికా రక్షణ శాఖ కేంద్రం పెంటగాన్ తిరిగి తెరుచుకుంది. కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అమెరికా రక్షణ రంగంలోని ఓ ప్రధాన అధికారి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘పెంటగాన్‌లో లాక్‌డౌన్ తొలగించడం జరిగింది. అయితే కాల్పులు జరిగిన మెట్రో స్టేషన్ ప్రాంతంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’ అని తన ట్విటర్‌లో ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. 


కాగా.. ఘటన జరిగిన మెట్రో స్టేషన్ వద్ద ప్రస్తుతం అర్లింగ్టన్ కౌంటీకి చెందిన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నిందితుడు జరిపిన కాల్పుల వల్ల చాలా మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. అయితే వారి గాయాల స్థాయి ఎలా ఉంది..? ఎవరైనా తీవ్రంగా గాయపడ్డారా..? చనిపోయారా..? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.


ఇదిలా ఉంటే అగ్రరాజ్య రక్షణ కేంద్రం సమీపంలో ఈ కాల్పులు జరగడం సంచలనంగా మారింది. మిలిట‌రీ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్‌కు కూతవేటు దూరంలోని ట్రాన్సిట్ సెంటర్లో ఉన్న మెట్రో రైల్వే స్టేషన్‌లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా కాలమాన ప్రకారం.. గురువారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. తుపాకీతో మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో స్టేషన్‌‌ రక్తసిక్తంగా మారింది. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి.

Updated Date - 2021-08-04T08:41:47+05:30 IST