తెలంగాణలో లాక్‌డౌన్?

ABN , First Publish Date - 2021-04-29T00:28:55+05:30 IST

లాక్‌డౌన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహామూద్

తెలంగాణలో లాక్‌డౌన్?

హైదరాబాద్: లాక్‌డౌన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోం సెక్రటరీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు కమిషనర్ల ఆధ్వర్యంలో సమీక్ష చేశారు. ఈనెల 30 తరువాత లాక్‌డౌన్ పెట్టె యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించింది. అంతేకాకుండా లాక్‌డౌన్‌పై హోమ్ శాఖకు ప్రతిపాదనలు చేరినట్లు సమాచారం.


మరోవైపు లాక్‌డౌన్ వదంతులు ప్రజలను వణికిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కాస్త గాడిలో పడింది. మరోసారి లాక్‌డౌన్ పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయేనని సమాన్యులు భయపడుతున్నారు. ఇప్పుడు వలసకార్మికలు స్థితి అగమ్యగోచరంగా ఉంది. హైదరాబాద్‌ శివారుల్లో పారిశ్రామిక కంపెనీలో పనిచేస్తున్న బిహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వలస కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ‘‘గత ఏడాది లాక్‌డౌన్‌లో ఊరెళ్లి తిరిగి హైద్రాబాద్‌కు వచ్చాం.. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌ అంటున్నారు. కంపెనీలు మూత పడతాయంటున్నారు’’ అంటూ ఇతర రాష్ట్రాల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రోజూ టెన్షన్‌ పడుతూ ఉండే కంటే ఊరెళ్లడమే ఉత్తమమంటూ వారు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2021-04-29T00:28:55+05:30 IST