ట్రైన్‌లో సీటు దొర‌క‌లేద‌ని వెంట‌నే కారు కొనుక్కొని...

ABN , First Publish Date - 2020-06-02T13:54:22+05:30 IST

యూపీలోని ఘజియాబాద్‌లో ఉంటున్న‌ ఒక వ్య‌క్తి ... లాక్‌డౌన్‌లో చిక్కుకుని రైలు ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్న జ‌నాన్ని చూసి, ఆ రైలులో తాను, త‌న భార్య వెళ్ల‌డం క‌ష్ట‌మ‌ని భావించారు. అక్క‌డ స‌మాజిక...

ట్రైన్‌లో సీటు దొర‌క‌లేద‌ని వెంట‌నే కారు కొనుక్కొని...

ఘజియాబాద్‌: యూపీలోని ఘజియాబాద్‌లో ఉంటున్న‌ ఒక వ్య‌క్తి ... లాక్‌డౌన్‌లో చిక్కుకుని రైలు ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్న జ‌నాన్ని చూసి, ఆ రైలులో తాను, త‌న భార్య వెళ్ల‌డం క‌ష్ట‌మ‌ని భావించారు. అక్క‌డ స‌మాజిక దూరం అస్స‌లు పాటించ‌డం లేద‌ని అత‌ను ఆరోపిస్తున్నాడు. ఈ నేప‌ధ్యంలో వెంట‌నే ఒక కారును కొనుగోలు చేసి, దానిలో తాను, త‌న భార్య కూర్చుని ఇంటికి చేరుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే పిపిగంజ్ ప్రాంతంలోని కైతోలియా గ్రామానికి చెందిన లల్లన్ ఘజియాబాద్‌లో పెయింట్‌, పాలిష్ పని చేస్తుంటాడు. భార్యాభ‌ర్త‌లు అక్క‌డే ఉంటున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా అతను ఉపాధి కోల్పోయాడు. దీంతో స్పెష‌ల్ రైలులో స్వ‌స్థ‌లానికి చేరుకోవాల‌ని అనుకున్నాడు. అయితే స్టేష‌న్‌లో ఉన్న‌జ‌నాన్ని చూసి కంగారు ప‌డ్డాడు. అయినా రైలులో సీటు దొరుకుతుందేమోన‌ని మూడు రోజుల పాటు ప్ర‌య‌త్నించాడు. ఫ‌లితం లేక‌పోవ‌డంతో తాను బ్యాంకులో దాచుకున్నరూ .1.5 లక్షలతో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. మే 31 ఉదయం 11 గంటలకు గోరఖ్‌పూర్‌న‌కు బయలుదేరాడు. 14 గంటల ప్రయాణం తరువాత తన గ్రామమైన రాంపూర్ కాథోలియాకు చేరుకున్నారు. లల్లన్‌కు కారు నడపడం రాక‌పోవ‌డంతో డ్రైవర్‌ను ఏర్పాటుచేసుకుని ఈ ప్ర‌యాణం సాగించాడు.

Updated Date - 2020-06-02T13:54:22+05:30 IST