కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలుకు సర్కారు ఆదేశాలు

ABN , First Publish Date - 2020-04-09T12:10:51+05:30 IST

ర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలుకు కర్ణాటక రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఆదేశాలు జారీ చేసింది....

కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలుకు సర్కారు ఆదేశాలు

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలుకు కర్ణాటక రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ప్రయాణికుల వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలను మే 30వతేదీ వరకు మూసివేయాలని, విద్యాసంస్థలు ఆన్ లైన్‌లో విద్యార్థులకు బోధించవచ్చని పేర్కొంది.


రాష్ట్రంలోని  అన్ని ఐటీ, గార్మెంట్స్ పరిశ్రమల్లో 50 శాతం మందితో నడిపేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా ప్రబలుతున్న వేళ పీపీఈలకు అధిక డిమాండ్ ఉన్నందున దాన్ని గార్మెంట్స్ కార్మికులు కుట్టాలని సర్కారు కోరింది.  భవననిర్మాణ కార్మికులు 50 శాతం మంది పనిచేసేందుకు అనుమతించారు. సాధారణ రోగుల కోసం ఆన్ లైన్ వైద్యసేవలను ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయించింది. ఏప్రిల్ 12వతేదీకల్లా కరోనా టెస్ట్ కిట్స్ వస్తాయని, వీటి సాయంతో ర్యాపిడ్ టెస్టులు చేయాలని సర్కారు ఆదేశించింది. ఏప్రిల్ 30వతేదీ వరకు కర్ణాటకలో బస్సులు, విమానాలు, రైళ్లు, మెట్రోరైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కర్ణాటక సర్కారు ప్రకటించింది. 

Updated Date - 2020-04-09T12:10:51+05:30 IST