వాస్తవ పరిస్థితి మదింపునకు 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

ABN , First Publish Date - 2020-04-10T08:52:12+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రకటించాక రాష్ట్రాల్లో -ముఖ్యంగా రోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా మదింపు..

వాస్తవ పరిస్థితి మదింపునకు 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

సీఎంలతో ప్రధాని చర్చ వేళకు నివేదిక

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: లాక్‌డౌన్‌ ప్రకటించాక రాష్ట్రాల్లో ముఖ్యంగా రోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా మదింపు వేయడానికి కేంద్రం తొమ్మిది రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపింది.  కరోనా కేసులు తక్కువగా ఉన్న బిహార్‌తో పాటు, కాస్త ఎక్కువగానే నమోదైన తమిళనాడు సహా దేశంలోని నాలుగుప్రాంతాల్లోని రాష్ట్రాల్లో ఈ మదింపు జరుగుతుంది. ప్రధాని శనివారం- 11వ తేదీన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. కేంద్ర బృందాలు ఇచ్చే నివేదిక ప్రాతిపదికగానే 14వ తేదీ తరువాత లాక్‌డౌన్‌ ఎంతమేర పొడిగించాలి, ఎక్కడ సడలించాలి.. అన్నది నిర్ణయిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-04-10T08:52:12+05:30 IST